జూన్ 15న గ్రహాల రాజు అయిన సూర్యుడు మిథున రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. అదే సమయంలో గురువు కూడా మిథున రాశికి చేరుకుంటాడు. అప్పటికి బుధుడు కూడా అక్కడే ఉంటాడు. దీనివల్ల సూర్య బుధ బృహస్పతి యుతి ఏర్పడుతుంది. దీన్నే త్రిగ్రహి యోగం అని అంటారు.
ఈ యోగం ఐదు రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. సూర్యుడు గురుడు కలవడం వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది. అలాగే బుధుడు సూర్యుడు కలవడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. ఇక మూడు గ్రహాలు కలవడం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. మూడు రకాల యోగం జూన్ 15నే ఏర్పడబోతోంది. ముఖ్యంగా త్రిగ్రహి యోగం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి త్రిగ్రహ యోగం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆ శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు ధనం వచ్చే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు మీ మాటలతోనే మీ చుట్టూ ఉన్న వారి హృదయాలను గెలుచుకుంటారు. ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా త్రిగ్రహయోగం కలిసి వస్తుంది. మీరు కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి కూడా మీకు దక్కుతుంది. అలాగే అందరి గౌరవాన్ని పొందగలుగుతారు. కెరీర్ విషయంలో వ్యక్తిగత జీవితం విషయంలో మంచి మెరుగుదల ఉంటుంది. ఇక్కడ ఉన్న స్థానికులు మానసికంగా బలంగా మారుతారు. వీరికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
తులా రాశి
త్రిగ్రహ యోగం తులా రాశి వారికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి వీరికి పూర్తి మద్దతు దక్కుతుంది. మీరు ఆధ్యాత్మికంగా మారుతారు. అలాగే ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఉన్నత విద్య చదవాలనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కూడా ప్రయత్నిస్తారు.
ధనుస్సు రాశి
త్రిగ్రహ యోగం ధనస్సు రాశి వారికి కూడా ఎన్నో శుభాలను అందిస్తుంది. వారి జీవితం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి నెలకుంటుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. భాగస్వామితో ఉత్తమమైన సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
కుంభరాశి
మూడు గ్రహాల కలయిక కుంభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఎటు చూసినా చూసినా విజయాలే దక్కుతాయి. కెరీర్ లో కూడా పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక రంగం వైపు వీరు మొగ్గు చూపుతారు. పొట్ట సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.