Office Stress Brain Health| ఈ రోజుల్లో జీవితంలో పని ఒత్తిడి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆఫీసులో వర్క్ టార్గెట్లు, డెడ్‌లైన్‌లు, డిజిటల్ పరికరాల కారణంగా అందరూ మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగానే మెదుడు ఆరోగ్యం దెబ్బతిని చివరికి బ్రెయిన్ ట్యూమర్ సమస్య వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆఫీసులో కొన్ని సులభమైన అలవాట్లు, బ్రెయిన్ ట్యూమర్‌ల వంటి సమస్య లను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. బ్రెయిన్ ట్యూమర్‌లు.. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికైనా రావచ్చు. దీని సాధారణ లక్షణాలు తలనొప్పి, వాంతులు, మూర్ఛపోవడం లేదా సమన్వయ సమస్యలు. ఈ లక్షణాలు మెదడులో ట్యూమర్ ఉన్న చోట లేదా ఒత్తిడి పెరగడం వల్ల కనిపిస్తాయి.
పని స్థలంలో గమనించాల్సిన లక్షణాలు
బెంగళూరు అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ కార్తీకేయన్ వైఆర్ చెప్పినట్లు.. ఆఫీసు ఒత్తిడి వల్ల వచ్చే అలసట బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను దాచవచ్చు. ఉదయం వేళ తీవ్రమయ్యే తలనొప్పులు, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల వచ్చే సమస్యలు, కాల్స్ సమయంలో మూర్ఛలు, ఈ మెయిల్స్ చదవడంలో ఇబ్బందిగా ఉండడం. చేతుల్లో బలహీనత లేదా సమన్వయ సమస్యలు ఒత్తిడి కంటే ఎక్కువైనవి కావచ్చు. దృష్టి మసకబారడం, నడవడంలో ఇబ్బంది, ఆందోళన లేదా డిప్రెషన్ వంటి మానసిక మార్పులు కూడా హెచ్చరిక సంకేతాలు. ఈ లక్షణాలు కొనసాగితే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
మెదడు ఆరోగ్యం కాపాడడానికి ఈ జాగ్రత్తలు పాటించండి
పని వేళల్లో కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి రెండు గంటలకు 10 నిమిషాల నడక రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. బాదం, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఉన్న ఆహారాలు తీసుకోండి. భోజన సమయంలో 5 నిమిషాల మైండ్‌ఫుల్‌నెస్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడమే కాక, మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయి.
నివారణ చర్యలు
స్క్రీన్ గ్లేర్‌ను తగ్గించడానికి బ్లూ-లైట్ ఫిల్టర్‌లు, సరైన లైటింగ్ ఉపయోగించండి. నీరు ఎక్కువగా తాగడం, ధూమపానం మానేయడం బ్రెయిన్ ట్యూమర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఎర్గోనామిక్ (ఆరోగ్యకరమైన కూర్చొనే పద్ధతి) డెస్క్‌లు మెడ ఒత్తిడిని తగ్గించి, మెదడుకు రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
ఒత్తిడిని నియంత్రించండి
భారతదేశంలో ఒత్తిడి సాధారణం, కానీ అది సమస్యలకు సంకేతం కావచ్చు. టీ బ్రేక్‌లకు బదులు, ఆఫీసు సహఉద్యోగులతో కలిపి కాసేపు నడవడం. పజిల్స్, జర్నలింగ్, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం వంటివి మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. లక్షణాలను ట్రాక్ చేయడానికి డైరీ రాయండి. ముందునుంచే న్యూరాలజికల్ సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలి.
ముందస్తు గుర్తింపు, చికిత్స
ముందస్తుగా సమస్యను గుర్తిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. లక్షణాలు తగ్గకపోతే, న్యూరోసర్జన్‌ను సంప్రదించి, సీటీ స్కాన్ లేదా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ చేయించండి. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌తో ముందుగానే ట్యూమర్‌ను గుర్తంచవచ్చు. ఫంక్షనల్ ఎమ్‌ఆర్‌ఐ, ట్రాక్టోగ్రఫీ వంటివి చేయించుకుంటే మరింత స్పష్టత వస్తుంది. చికిత్సలో స్టీరియోటాక్టిక్ బయాప్సీ, మైక్రోసర్జికల్ ఎక్సిషన్, ఇంట్రాఆపరేటివ్ ట్యూమర్ ఫ్లోరోసెన్స్ వంటివి ఉన్నాయి. ట్యూమర్ గ్రేడ్, శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా దీర్ఘకాల ఫలితాలను నిర్ణయిస్తాయి. రెగ్యులర్ ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లు, న్యూరో-నావిగేషన్ టెక్నాలజీ వంటివి చికిత్సను మెరుగుపరుస్తాయి.
Also Read: నల్ల మచ్చలు లేని మెరిసే చర్మం కావాలా.. ఈ జ్యూస్‌తో ఖర్చు లేకుండానే
మెదడు అనేది ఆరోగ్యంలో అతిముఖ్యమైనది. పని ఒత్తిడి వల్ల కలిగే నష్టాలు వాటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యకర అలవాట్లు, లక్షణాల గుర్తింపు మీ మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.