Rohit’s Lamborghini: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన ఖరీదైన కారును తన అభిమాని అమ్మేసుకున్నాడు. మెయింటెనెన్స్ చేయలేక… ఖరీదైన కారణం అమ్ముకుని షాక్ ఇచ్చాడు రోహిత్ శర్మ అభిమాని. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన లంబోర్ఘిని ఉరుస్ కారును డ్రీమ్ 11 లక్కీ విన్నర్ కు గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే. మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే… తన ఖరీదైన కారును… డ్రీం 11 లక్కీ విన్నర్ కు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.
లంబోర్ఘిని ఉరుస్ అమ్ముకున్న రోహిత్ శర్మ ఫ్యాన్
నాలుగు కోట్ల రూపాయల విలువైన ఈ లగ్జరీ కారు మెయింటెనెన్స్ తట్టుకోలేక… డ్రీమ్ 11 లక్కీ విన్నర్, రోహిత్ శర్మ ఫ్యాన్ ఓ బడా వ్యాపారస్తునికి అమ్మి… చేతులు దులుపుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండానే సైలెంట్ గా అమ్మేసినట్టు తెలుస్తోంది. ఎంతో ప్రేమగా రోహిత్ శర్మ ఈ కారును గిఫ్ట్ గా ఇస్తే… దాని మెయింటెనెన్స్ భరించలేక అమ్ముకున్నాడు. ఇక ఈ లగ్జరీకారులో సదరు వ్యాపారి ముంబై వీధుల్లో తాజాగా చెక్కర్లు కొడుతూ కనిపించడం జరిగింది.
ముంబై వీధుల్లో ఆ లగ్జరీ కారు తిరగడంతో…. నిజంగానే రోహిత్ శర్మ కారులో ఉన్నట్లు అందరూ ఊహించుకొని దాని వెనుక ఫాలో అయ్యారు. కానీ కారు లోపల చూస్తే మాత్రం మరో వ్యక్తి ఉన్నాడు. రోహిత్ శర్మ కనిపించలేదు. దీంతో ఆ లగ్జరీకారును.. వ్యాపారి కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోని చూసిన రోహిత్ శర్మ అభిమానులు… తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. ఎంతో ప్రేమతో కార్ గిఫ్ట్ ఇస్తే.. ఇలా అమ్ముకుంటారా అని ఫైర్ అవుతున్నారు రోహిత్ శర్మ అభిమానులు.
టెస్టులు, టి20 లకు రోహిత్ శర్మ గుడ్ బాయ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులు అలాగే టి20 మ్యాచ్ లకు రిటర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ… కెప్టెన్ గా కొనసాగి ఆ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్సులు ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ లోపే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకుని శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ ఇస్తారని కూడా చెబుతున్నారు. వన్డే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యారు ను చేయాలని… భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే వాళ్లు నిర్ణయం తీసుకునే కంటే ముందు తానే తప్పుకోవాలని అనుకుంటున్నారట రోహిత్ శర్మ.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
The Aura of Rohit Sharma's old blue Lamborghini 264.🔥🥶
After Rohit's car was given as a prize in Dream 11, the winner has sold this car to the seller and now seller is driving the car on the streets of Mumbai. pic.twitter.com/XPhdcxi6cg
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2025