TTD Darshan Tickets Online : కనరో భాగ్యము. శ్రీవారి దర్శనము. ఏడుకొండల వాడి దర్శనం అంత ఈజీ కాదు. ఉచిత దర్శనానికి లక్షల్లో జనం వస్తుంటారు. గంటల తరబడి క్యూ లైన్లు. అదే రూ.300 టికెట్ తీసుకుంటే త్వరగా శ్రీవారిని చూసే భాగ్యం లభిస్తుంది. కానీ, ఆ టికెట్స్ పరిమితంగానే ఉంటాయి. అందుకే వాటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక, తిరుమల శ్రీవారి సేవా టికెట్ల కోసం ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కౌంటర్ ఓపెన్ కాగానే.. అలా టికెట్లు అయిపోతుంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవి దొరకవు. శ్రీవారి సేవలను కనులారా వీక్షించే అదృష్టం ఏ కొందరికి మాత్రమే దక్కుతుంది. మీరూ ఆ అదృష్టవంతుల జాబితాలో ఉండాలంటే కాస్త అలర్ట్‌గా ఉండాలి. జూలై నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్ల జారీ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆ తేదీలు నోట్ చేసుకోండి. సమయానికి లాగిన్ అయి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి..
జూలై నెలకు సంబంధించి.. స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ.300 టిక్కెట్లు కావాలంటే.. ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. నిమిషాల్లోనే ఆ టికెట్స్ అయిపోతుంటాయని గుర్తు పెట్టుకోండి. ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్.
ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల నుంచి.. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డీఐపీ రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 21 వరకు అవకాశం ఉన్నా.. ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్.
జూలై నెలకు సంబంధించి.. శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార.. తదితర సేవా టికెట్ల కోటా బుకింగ్ ఏప్రిల్ 22న ఉదయం 10 గంటల నుంచి ఓపెన్ చేస్తారు. అదే.. ఆన్‌లైన్ సేవలో పాల్గొనాలంటే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కోటా బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ అన్ని సేవా టికెట్లు నిమిషాల్లోనే అయిపోతాయని గుర్తుంచుకోండి.
జూలై నెలలో.. తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్ల బుకింగ్స్.. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా బుకింగ్ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.
జూలై నెలలో టీటీడీ వసతి కోటా బుకింగ్స్.. ఏప్రిల్ 24న, మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయి.
మే నెలకు సంబంధించి.. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరులో ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 200 టిక్కెట్ల బుకింగ్ ఏప్రిల్ 24న ఉదయం 19 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
మే నెలలో.. సప్త గోవు ప్రదక్షిణశాల, అలిపిరి దగ్గర ఉన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్ల బుకింగ్స్.. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయి.
Also Read : మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎందుకంటే..