BigTV English

Black Thread : నల్లదారం వెనుక నమ్మలేని నిజాలు

Black Thread : నల్లదారం వెనుక నమ్మలేని నిజాలు

Black Thread : ఈ మధ్య ఎవరి కాళ్లకు చూసినా నల్లదారాలు కనిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగానే ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వాస్తవానికి నల్లదారం ప్రతీ ఒక్కరూ కట్టుకోకూడదు. నల్లదారం కేవలం చంటి పిల్లలకు మాత్రమే కట్టాలి. అది కూడా ఆరునెలల వచ్చేంత వరకూ మాత్రమే కొనసాగించాలి. అంటే అన్నప్రాసన వచ్చే వరకు కాళ్లకి, చేతులకి నల్లదారం కట్టవచ్చు..


మొలతాడు, నల్లపూసలు కట్టడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. బాలారిష్టాలు పొగట్టడానికి, దిష్టి దోషాలు తగ్గించుకోవడం బిడ్డ క్షేమం కోరుతూ నల్ల దారం కడుతుంటారు. మీ దగ్గర బంగారం ఉన్నా…సరే నల్లతాడే కట్టాలి. గతంలో మనం ధరించే బట్టలు బట్టి మనం చేస్తున్నామో చెప్పేసేవారు. తెల్లటి తలపాగాతో కట్టుకోవడం ఆరోగ్యానికి, న్యాయానికి సంబంధించిన విషయం. డాక్టర్లు తెల్లకోటు వేసుకోవడం, ఒకప్పుడు జడ్జిలు కూడా తెల్లటి విగ్ పెట్టుకుని తీర్పులు ఇచ్చేవారు. మన భారతదేశంలో సంప్రదాయం అక్కడది.

ఎర్రటి తలపాగా పెట్టుకుని , ఎర్రకండువా కట్టుకుని పని చేయడాన్ని అభిచారకర్మ అంటారు . గతంలో పోలీసులు ఎర్రటి టోపీ పెట్టుకునేవారు. ఇలా ప్రతీ రంగుకి ఒక ప్రత్యేకత ఉంది. కానీ నల్లటి వస్త్రాలు నిషేధమని మార్కండేయ పురాణం చెప్పింది. ఒక ప్రక్రియలో పనిచేసేటప్పుడు మాత్రమే ఉపయోగించాలని తెలిపింది.


పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు మాత్రమే నల్లదారం కట్టాలి. తద్వారా….రోగనిదానం జరుగుతుంది. దోష నివారణ జరుగుతుంది. పిల్లలకు క్షేమం కలుగుతుంది. ఆడవాళ్లు నల్లపూసలు కట్టుకోవడం కాదు..నల్ల మణి ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కటే నల్లపూస కట్టుకోవాలి అది కూడా 16రోజుల పండుగు నాడు మాత్రమే… అంతేకానీ నలుగురు చేస్తున్నారని మనం నల్లదారం కట్టుకోవడం సరికాదు. మార్కండేయ పురాణం ప్రకారం నల్లటి రంగు నిషేధం.

నలుపు రంగు పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రంగు . ఇప్పటికే పసుపు తాడు, ఎరుపు తాడును ధరించిన వాళ్లు నల్ల దారం ధరించకపోతే మంచిదని చెప్పవచ్చు. నల్ల దారం ధరించడంలో ఏవైనా సందేహాలు ఉంటే జ్యోతిష్య నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.కొన్ని రాశుల వాళ్లపై నల్లదారం ప్రభావం చూపే అవకాశం ఉంది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×