E-Paper
Advertisement

Benefits With Fruits Peels : తొక్కే కదా అని తీసేయొద్దు!..ఇలా వాడండి..!

Benefits With Fruits Peels : తొక్కే కదా అని తీసేయొద్దు!..ఇలా వాడండి..!
Advertisement
Beauty Tips

Benefits With Fruits Peels : చాలా మంది ఆరోగ్యానికి మేలు చేస్తుందని రకరకాల పండ్లను కొంటుంటారు. పండును తిని తొక్కను పడేస్తుంటారు.కానీ పండే కాదు.. వాటి తొక్కల్లోనూ బోలెడు పోషకాలు ఉంటాయి. పండు ఆరోగ్యానికి మేలు చేస్తే.. తొక్క సౌందర్య పోషణలో సాయపడుతుంది. ఆ పండ్లేవో తెలుసుకుందామా!

కివీ..
ఇందులో విటమిన్‌- ఇ పుష్కలంగా ఉంటుంది. దీని తొక్కలకు పెరుగు కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే సరి. ఇది వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు స్వచ్ఛమైన సౌందర్యాన్ని పొందవచ్చు.

Advertisement

నారింజ..
విటమిన్‌- సి, సహజ నూనెలు సమృద్ధిగా ఉన్న నారింజ తొక్కలు అందానికి మేలు చేస్తాయి. ఎండిన తొక్కలను మెత్తగా పొడి చేసి, పెరుగుతో కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. మొటిమలను తగ్గించడంలోనూ, మచ్చలను మాయం చేయటంలోనూ చక్కని ఔషధం నారింజ.

నిమ్మ..
దీనిలోని సిట్రిక్‌ యాసిడ్‌ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. నిమ్మ తొక్కలను ఎండబెట్టి ఆ పొడిని తేనెతో కలిపి ఫేస్‌ప్యాక్‌ వేయాలి. పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి.ఇది మొటిమలను తగ్గించటమే కాదు, ముఖంపై ఉన్న జిడ్డునూ తొలగిస్తుంది.

Advertisement

అరటి..
దీనిలో విటమిన్‌ ఎ, బి,సిలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని చర్మంపై రుద్దాలి. ఇది తేమను అందించి, మచ్చలను మాయం చేస్తుంది. పైగా అరటి చర్మానికి తేమను అందిండచంలో సహాయపడుతుంది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×