E-Paper
Advertisement

Vastu Tips for Kitchen : వంట గదిలో ఇవి బోర్లించి పెట్టారా…

Vastu Tips for Kitchen : వంట గదిలో ఇవి బోర్లించి పెట్టారా…
Advertisement
Vastu Tips for Kitchen

Vastu Tips for Kitchen : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆగ్నేయ దిక్కున ఉండే వంట గదికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. కిచెన్ లో చేసే కొన్ని తప్పులు జీవితంలో సమస్యలకు కారణమవుతాయి. ఒక్కోసారి వ్యాపారంలోను, ఉద్యోగంలోను వాస్తు దోషాలు నష్టాలను కలిగిస్తుంటాయి. ఇంట్లోని వంట గది అన్నపూర్ణాదేవి నివాసం ఉండే ప్రాంతం. అందుకే కిచెన్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. పనికి రాని వస్తువులు అస్సలు ఉంచకూడదు. అలాగే కొన్ని వస్తువులు ఎలా పెట్టాలో తెలుసుకుని పెట్టాలి. ప్రత్యేకించి కొన్ని వస్తువులను గదిలో అసలు బోర్లించి ఉంచకూడదు.

ఇంట్లో ముఖ్యంగా వంట గదిలో పగిలిపోయిన, విరిగిపోయిన గిన్నెలను , ప్లేట్లు అసలు పెట్టుకోకూడదు. బద్దకంతో వాటిని ఇంట్లో ఉంచితే మనకి వాస్తుపరమైన సమస్యలు వస్తుంటాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. బాణలిని కాని, అట్లు వేసుకునే పెనం కానీ బోర్లా పెట్టకూడదు. ఇలా బోర్లా పెడితే ఆర్థిక కష్టాలకి గురవుతారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Advertisement

ఇంటిని శుభ్రం చేసే చీపురులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అలాంటి చీపురును వంట గదిలో పెట్టరాదు. అందుకే పొరపాటున కూడా చీపురును పెట్టి మరిచిపోకూడదు. కిచెన్ లో చీపురు ఉంచితే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అన్నపూర్ణా దేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. ప్రత్యేకించి దేవుడి ఎదురుగా అసలు ఉంచకూడదు. మందులు కూడా కిచెన్ లో పెట్టకూడదు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ను కూడా ఉంచకూడదు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×