BigTV English
Advertisement

Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?

Weekly Horoscope Nov 3 to 9: ఈ వారమంతా మీకు ఎలా ఉండబోతుందంటే..?

Weekly Horoscope Nov 3 to 9: గ్రహాల సంచారం ఆధారంగా రాశిఫలాలు అంచనా వేస్తారు. గ్రహాలు, నక్షత్ర సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ వారం అంటే 3 నవంబర్ నుంచి 9 నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: ఈ వారం మీ జీవితం హెచ్చు తగ్గులతో సవాలుగా ఉంటుంది. కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆస్తికి సంబంధించి సమస్యలు ఏర్పడతాయి. వివిధ పరిస్థితులలో అవమానాలు ఎదుర్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమాదాలను నివారించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వృషభ రాశి: ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువ గడిపే అవకాశం ఉంది. కుటుంబ మద్దతు మీకు ఉంటుంది. అంతే కాకుండా కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చ. ఇప్పటికే ఉన్న ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ పరిష్కరించబడతాయి. ఆధ్యాత్మికతపై పెరుగుతున్న ఆసక్తితో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మిథున రాశి: మిధునరాశి, ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వారితో కలిసి సంతోషకరమైన క్షణాలను ఆగడుపుతారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులతో మీకు ఉన్న విభేదాలు పరిష్కరించబడతాయి. మీ పనులను ఇతరులు పరిష్కరిస్తారు.

కర్కాటక రాశి: ఈ సమయం మీకు సవాలుతో కూడినదై ఉంటుంది. సమస్యలు, మానసిక కలతలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో జరిగిన సంఘటన ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుంది. మీరు ప్రియమైన వ్యక్తిని కోల్పోవాల్సి రావచ్చు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి.

సింహ రాశి: ఈ వారం కష్టపడి పని చేయడం వల్ల విజయం సాధిస్తారు. నిరాశకు గురవుతారు. మీ దగ్గరి వారే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబ విబేధాలు ఏర్పడతాయి. ఇంటి విషయాలపై ఇతరులతో గొడవ పడతారు. జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈ సమయంలో గొడవలకు దూరంగా ఉండండి.అనవసర మాటలు మాట్లాడకండి.

కన్య రాశి: ఈ వారం మీకు సాధారణంగానే ఉంటుంది. కానీ మీరు వివిధ సమస్యల కారణంగా మీ పనిపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడతారు. కుటుంబ లేదా కోర్టు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాత వివాదం మళ్లీ తెరపైకి రావచ్చు. ఆందోళనలు మీ మనస్సును ప్రభావితం చేస్తాయి. కుటుంబ విషయాలలో, ముఖ్యంగా మీ భార్యకు సంబంధించి జాగ్రత్తగా ఉండండి . కుటుంబ చర్చలలో నాయకత్వం వహించకుండా ఉండండి.

తులా రాశి: ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీకుఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. మీరు సామాజికంగా, రాజకీయంగా కుటుంబ సభ్యులు గౌరవం పొందుతారు. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అంతే కాకుండా ఉద్యోగులకు మంచి అవకాశాలు అభిస్తాయి. కుటుంబ సభ్యలుతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈ వారం మీరు ఇతరులు చేసిన పనులకు బాధ్యత వహిస్తారు. కొంతమంది కుటుంబ సభ్యులు అనుకోకుండా విభేదాలు సృష్టిస్తారు. కుటుంబ సంబంధాలను పెంపొందించడంపై దృష్టి పెట్టండి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఇతరులతో సామరస్యంగా పని చేయండి.

ధనస్సు రాశి: ఈ వారం మీరు సామాజిక, రాజకీయ రంగాలలో వ్యతిరేకతను ఎదుర్కుంటారు. మీ విరోధులు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి మీ ప్రతిష్టను దిగజార్చడానికి సిద్దమవుతారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రశాంతతను కాపాడుకోండి, కోపానికి దూరంగా ఉండండి. మీ కీర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి ప్రశాంతంగా ఉండండి.

మకర రాశి: ఈ వారం సానుకూల మార్పులను తెస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలలో రాణిస్తారు. మీకు కుటుంబం మద్దతుగా ఉంటుంది మీ భార్యతో సామరస్యపూర్వకమైన సంబంధాన్ని ఏర్పరుచుకోండి.

Also Read: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్

కుంభ రాశి: ఈ వారం మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందుతాయి. కుటుంబంలో ఒక శుభ కార్యం జరగే అవకాశాలు ఉన్నాయి. కొత్తఅతిథి మీతో చేరతారు మీ కుటుంబం ప్రతి నిర్ణయానికి మద్దతునిస్తుంది.

మీన రాశి: మీ మాటలను అదుపులో ఉంచండి. కుటుంబ వివాదాలు పెరగనివ్వవద్దు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి .. సామరస్య వాతావరణాన్ని సృష్టించడానికి మీ ప్రియమైనవారితో, ముఖ్యంగా మీ భార్యతో నాణ్యమైన సమయాన్ని గడపండి.

Related News

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Big Stories

×