E-Paper
Advertisement

Rahu Transit Aquarius: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్

Rahu Transit Aquarius: 2025లో రాహువు సంచారం.. ఈ 3 రాశుల వారి తలరాతలు మారిపోనున్నాయ్
Advertisement

Rahu Transit Aquarius: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువును నీడ , పాప గ్రహంగా పరిగణిస్తారు. రాహువు ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే సంచరిస్తాడు. అంటే ఏ రాశిలోనైనా ముందుకు వెళ్లకుండా, రాహువు వెనుకకు కదులుతాడు. రాహువు ప్రస్తుతం బృహస్పతి స్వంత రాశి అయిన మీన రాశిలో సంచరిస్తున్నాడు.

మే 18, 2025న రాహువు తన రాశిని మార్చి శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. రాహువు సుమారు 18 నెలల పాటు ఈ రాశిలో ఉండి తరువాత మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఏ రాశుల వారు రాహువు రాశి సంచారం వల్ల ఎక్కువ ప్రభావితం అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి:
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం మేష రాశి యొక్క మూడవ, ఆరవ, పదకొండవ ఇంట్లో రాహువు సంచరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాహువు 2025లో మేషరాశి వారికి పదకొండవ స్థానమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు త్వరలో పూర్తి కానున్నాయి. మీరు మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడటం చూస్తారు. లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. మీరు వ్యాపార, వృత్తి రంగంలో చాలా మంచి లాభాలు లాభాలను పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిచోటా పెరుగుతుంది. కొత్త సంవత్సరం మీకు సంతోషాలను తీసుకురాబోతోంది. కెరీర్‌లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం. జీతం, పదోన్నతులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

కన్య రాశి:
2025లో కన్య రాశి వారి ఆరవ ఇంట్లో రాహువు సంచరిస్తాడు. రాహువు సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో, రాబోయే కొత్త సంవత్సరం కన్య రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాహువు కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే జీవితంలో మీరు ఎదుర్కుంటున్న సమస్యలు లేదా ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఆఫీసుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. కోర్టులో జరుగుతున్న వివాదాలు సమసిపోతాయి. ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మీ కుటుంబంలో అందరి నుండి మద్దతు పొందుతారు.

Advertisement

Also Read: నవంబర్‌లో 4 గ్రహాల సంచారం.. ఈ రాశుల జీవితాలు మారిపోనున్నాయ్

ధనుస్సు రాశి:
2025లో రాహువు సంచారం ధనస్సు రాశి వారి అద్భుత ప్రయోజనాలను కలిగిస్తుంది. మీ మూడవ ఇంట్లో రాహువు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రాహువు రాశి మారినప్పుడు 2025లో మీ పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీ విజయానికి కొత్త ప్రయత్నాలు కనుగొంటారు. మీ ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యాపారంలో అనేక ప్రణాళికలు మీకు లాభదాయకంగా, విజయవంతంగా మారతాయి. ఉద్యోగస్తులకు కూడా, 2025 సంవత్సరంలో రాహువు సంచారం మేలు చేస్తుంది. మీ కుటుంబ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×