Vaisakha Masam 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖం సంవత్సరంలోని రెండవ నెల. ఇది ఏప్రిల్ 13, 2025 న ప్రారంభమై మే 12న ముగుస్తుంది. ఈ మాసం విష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా చెబుతారు. ఈ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయడం, దానధర్మాలు , పుణ్యకార్యాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో పూర్వీకులకు పేరున చేసే తర్పణ, పిండ ప్రదానం, దానాలు పితృ దోషాన్ని తగ్గించి, వారి ఆశీస్సులతో జీవితంలో శాంతి, ఆనందాన్ని ఇస్తాయని నమ్ముతారు.
వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత:
వైశాఖ మాసంలో త్రేతాయుగం ప్రారంభమైందని విశ్వసిస్తారు. దీనిని ‘మాధవ మాసం’ అని కూడా పిలుస్తారు. విష్ణువుకు మరో పేరు మాధవుడు. ఈ నెలలో తులసి ఆకులు అర్పించి శ్రీ మహా విష్ణువు పూజించడం, పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు నశించి, అదృష్టం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెలలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
వైశాఖం మాసంలో సూర్యోదయానికి ముందు పవిత్ర నదులలో స్నానం చేసి, వివిధ దానాలు చేయడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఈ మాసం దానధర్మాలు, పుణ్య స్నానం , జపానికి చాలా మంచిది. దీని ప్రత్యేక ప్రాముఖ్యతను గ్రంథాలు , పురాణాలలో వర్ణించారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలకు ప్రతిఫలం అనేక రెట్లు పెరుగుతుందని అంటారు.
వైశాఖ మాసం అన్ని మాసాలలోకీ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో చేసే పుణ్యం మరే మాసంలో చేసే పుణ్యంతో సమానం కాదు. ఈ మాసంలో తప్పకుండా చేయాల్సిన దానాలు :
1. జలదానం:
వైశాఖంలో జలదానం ఉత్తమమైనదిగా చెబుతారు. స్కాంద పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. జలదానం ఈ మాసంలో చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. వస్త్ర దానం:
ఈ మాసంలో..పేదలకు లేత, తెలుపు దుస్తులను దానం చేయడం చాలా పుణ్యప్రదం. ఇలా చేయడం వల్ల పాపాలను తొలగిపోతాయి. అంతే కాకుండా మానసిక ప్రశాంతతను లభిస్తుంది. అగ్ని, సూర్య దోషాలు తొలగిపోతాయి.
4. గొడుగు, చెప్పులు దానం:
ఎండ వేడిమి నుండి రక్షించడానికి గొడుగు, చెప్పులు లేదా టోపీని దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. ఈ దానం మీకు దీర్ఘాయువు, ప్రతిష్ట అందిస్తుంది. ఇది రాహువు , కేతువుల దుష్ప్రభావాలను కూడా శాంతింపజేస్తుంది.
5. బెల్లం , చక్కెర దానం:
మాధుర్యానికి ప్రతీకగా.. ఈ దానం ముఖ్యంగా వైశాఖలో తీపి నీరు, షర్బత్ లేదా బెల్లం దానం రూపంలో చేయవచ్చు. ఇది మాటల్లో మాధుర్యాన్ని తెస్తుంది. అంతే కాకుండా మీ కుటుంబ జీవితాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. శుక్రుడు , బుధుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
Also Read: ఏప్రిల్ 25 న పంచగ్రాహి యోగం.. ఈ రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమే
6. రాగి పాత్రను దానం:
ముఖ్యంగా నీటితో నిండిన రాగి కలశం దానం చేయడం ఈ మాసంలో ఉత్తమమైనదిగా చెబుతారు. ఇది సూర్యభగవానుడి ఆశీస్సులను మీకు అందిస్తుంది. అంతే కాకుండా పితృ దోషాన్ని శాంతింపజేస్తుంది.
7. పండ్లు దానం చేయడం:
శివారాధనలో బిల్వ ఫలం దానం చేయడం చాలా ఫలవంతమైనది . తాజా పండ్లను దానం చేయడం వల్ల మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు.