BigTV English

Astrology : ఏ నక్షత్రంలో పుడితే ఏ రంగంలో స్థిర పడతారో తెలుసా..? అసలు జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందంటే..?

Astrology : ఏ నక్షత్రంలో పుడితే ఏ రంగంలో స్థిర పడతారో తెలుసా..? అసలు జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందంటే..?

Astrology : మీరు ఏ నక్షత్రంలో పుట్టారో మీకు తెలుసా..? అయితే మీ నక్షత్రాన్ని బట్టి మీరు ఏ రంగంలో  డెవలప్‌ అవుతారో తెలుసుకోవాలని ఉందా..? మీకు గోల్డెన్‌ ఫీచర్‌ ఏ ఫీల్డ్‌ లో ఉంటుందో కనుక్కోవాలని ఉందా..? అయితే 27 నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులకు సరిపోయే ఫీల్డ్‌ ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మనిషి పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి అతని జన్మ  నక్షత్రాలను నిర్దారిస్తారు. వ్యక్తుల జననకాల సమయాల్లో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రాన్నే ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు ఉంటాయి. నక్షత్రాలను దేవగణం, రాక్షసగణం, మానవగణం అని మూడు రకాలుగా విభజిస్తుంది జ్యోతిష్యశాస్త్రం.

అశ్వనీ నక్షత్రం: అశ్వనీ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఉత్సాహంగా ఉంటారు. వీరికి గేమ్స్‌ అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వైద్యం వృత్తి, ఇంజనీరింగ్‌, క్రీడలు, సైనిక సేవలు, వ్యాపారం, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు కలిసి వస్తాయి.


భరణి నక్షత్ర: ఈ నక్షత్ర జాతకులు చాలా అందంగా ఉంటారు. వీరికి లౌక్యము, చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారికి టెక్నికల్‌, పోలీస్‌ ఫోర్స్‌, కస్టమ్స్‌, అగ్రికల్చరల్‌, బిజినెస్‌, న్యాయవాద వృత్తుల్లో బాగా రాణిస్తారు.

కృత్తిక నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఆవేశపరులై ఉంటారు. అంతటా తమ ఆధిక్యత ఉండాలని ఆరాటపడతారు. ఈ నక్షత్రంలో పుట్టినవారికి హాస్పిటాలిటీ, అభరణాల తయారీ, ఉపాధ్యాయులుగానూ గుర్తింపు పొందే అవకాశం ఉంది.

రోహిణి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులు రవాణా, పశువైద్యం, వ్యవసాయం, కంటి వైద్య నిపుణులు, వ్యవసాయ రంగాలు వీరికి కలిసి వస్తాయి. కాబట్టి ఈ రోహిణి నక్షత్ర జాతకులు పై రంగాలను ఎంచుకుంటే భవిష్యత్తు బంగారమయంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మృగశిర నక్షత్రం: ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు వ్యాపారం చేయడం కానీ, పర్ఫ్యూమ్‌ ఇండస్ట్రీ, ఫారెస్ట్‌, అగ్రికల్చర్‌, సంగీత విద్వాంసులు, అధ్యాపకులు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్‌ డిజైన్లు వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి.

ఆరుద్ర నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు కళా, వ్యాపార రంగాలలో అడుగు పెడితే నిష్ణాతులు అవుతారట. మైండ్‌ రీడింగ్‌ చేయగలిగే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది.

పునర్వసు నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప శిల్పులుగాను.. మెకానిక్‌లు గానూ, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగానూ రాణిస్తారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు బాగా వస్తాయి.

పుష్యమి నక్షత్రం:  ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు రాజకీయం బాగా కలిసి వస్తుంది. వీరికి ప్రజలతో మంచి రిలేషన్స్‌ ఉంటాయి. అలాగే మోటివేషనల్‌ స్పీకర్‌గానూ రాణించగలరు. అలగే ఆధ్యాపకులుగానూ వీరికి తిరుగుండదు.

ఆశ్లేష నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు ఫైనాన్స్‌, షేర్‌ మార్కెట్‌, ఫార్మా, న్యాయ వాద వృత్తులు బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపారం, సినీ, కళా రంగాల్లోనూ నెంబర్‌ వన్‌ స్థాయికి వెళ్తారు.

మఖ నక్షత్రం: ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు గొప్ప వైద్యులుగానూ, చర్మవాధి నిపుణులుగా, గైనకాలజిస్టులుగానూ రాణిస్తారు. అలాగే విద్యా రంగాంలోనూ వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

పూర్వఫాల్గుని నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు సినీ ఆర్టిస్టులుగానూ.. మ్యూజిక్‌ డైరెక్టర్లుగానూ మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. అలాగే డాన్సర్లు, మేనేజర్లుగా, లాయర్లుగా గుర్తింపు వస్తుంది.

ఉత్తర ఫాల్గుని నక్షత్రం: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఆర్కిటెక్‌ రంగం బాగా కలిసి వస్తుంది. ఇంకా న్యాయవాదులుగా, పోలీసులుగా, కలెక్టర్లుగానూ రాణిస్తారు. పెయింటింగ్ లోనూ వీరు గొప్ప స్థాయికి వెళ్తారు.

హస్తా నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు హోటల్‌, ఫుడ్‌ బిజినెస్‌ బాగా కలిసి వస్తుంది. అలాగే వస్త్ర, అభరణాలు వ్యాపారం, డిజైనింగ్‌ లోనూ ఈ జాతకులు రాణించగలరు.

చిత్తా నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం  ఉంటుంది. అలాగే జర్నలిస్టులుగానూ, అకౌంటెంట్‌, డెకరేటర్స్‌, రైటర్లుగా వీరికి గుర్తింపు వస్తుంది.

స్వాతి నక్షత్రం: స్వాతి నక్షత్ర జాతకులకు న్యాయవాద వృత్తులు, ధార్మిక గురువులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే సైంటిస్ట్‌ లుగా.. బిజినెస్‌ చేయడంలో మంచి రాణింపు ఉంటుంది.

విశాఖ: ఈ నక్షత్ర జాతకులకు రాజకీయ, మీడియా రంగాలు బాగా కలిసి వస్తాయి. ఇంకా వ్యాపారం చేయడంలోనూ మేనేజ్‌మెంట్ రంగాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

అనురాధ నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు సంగీతం, కళలు, భౌతికశాస్త్రం, టూరిజం, లాజిస్టిక్స్‌, రియల్‌ ఎస్టేట్‌ లాంటి రంగాలు బాగా కలిసి వస్తాయి.

జేష్ఠ నక్షత్రం: ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు సైనిక, పోలీస్‌, సైకాలజీ, వ్యాపార, రాజకీయ రంగాలు కలిసి వస్తాయి. ఆయా రంగాలలో వీరు తమదైన గుర్తింపును తెచ్చుకుంటారు.

మూలా నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు మెడిసిన్‌, రీసెర్చ్‌, ధార్మిక, విద్యా, వ్యాపార రంగాలు కలిసి వస్తాయి. ఆయా రంగాలలో ఈ జాతకులు బాగా రాణిస్తారు.

పూర్వాషాడ నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వారికి బోధన, ప్రయాణ, టూరిజం, మెడికల్‌ రంగాలు బాగా కలిసి వస్తాయి. అలాగే లాయర్లుగానూ వీరు జీవితంలో స్థిరపడగలరు.

ఉత్తరాషాడ నక్షత్రం: ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఆర్థికరంగం, రాజకీయం, బోధన, వైద్య రంగాలు బాగా కలిసి వస్తాయి. ఈ జాతకులు ఆయా రంగాల్లో బాగా రాణిస్తారు.

శ్రవణ నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులు చరిత్రకారులుగా, ఆధ్యాపకులుగా, జర్నలిస్టులుగా, టూరిజం వంటి రంగాలలో స్థిరపడగలరు. అలాగే ఉపన్యాసకులుగానూ ఈ జాతకులు బాగా రాణిస్తారు.

ధనిష్టా నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు సంగీతం, డాన్స్‌, ఆర్మీ పోలీస్‌, వ్యాపార, ఇంజనీరింగ్‌, క్రీడలు వంటి రంగాలు కలిసి వస్తాయి.

శతభిష నక్షత్రం: ఈ నక్షత్ర జాతకుల మెడిసిన్‌, రీసెర్చ్‌, రసాయన పరిశోధన, సైకియాట్రిస్టు, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. అలాగే మీడియా రంగంలోనూ మంచి జర్నలిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటారు.

పూర్వాభాద్ర నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు తత్వశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, మెడికల్‌ ఫీల్డ్‌, మేనేజ్‌మెంట్‌ వంటి రంగాలు కలిసి వస్తాయి. ఇక ఆధ్యాత్మిక రంగంలోనూ వీరు మంచి గుర్తింపు తెచ్చుకోగలరు.

ఉత్తరాభాద్ర నక్షత్రం: ఈ నక్షత్రంలో పుట్టిన వారికి రాజకీయ, ఆధ్యాత్మిక, రిసెర్చ్‌, ఆధ్యాపక రంగాలు కలిసి వస్తాయి. అలాగే సమాజ సేవలో మంచి గుర్తింపు తెచ్చుకోగలరు.

రేవతి నక్షత్రం: ఈ నక్షత్ర జాతకులకు కళా, టూరిజం, రిసెర్చ్‌ రంగాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వ్యాపారవేత్తలుగానూ ఫిల్మ్‌ డైరెక్టర్లు గానూ, ఈ జాతకులు స్థిరపడే అవకాశం ఉంటుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×