Jyotika - Suriya (Source: Instragram)
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్నారు జ్యోతిక, సూర్య. ఇద్దరూ కూడా పలు సినిమాలలో నటిస్తున్నప్పుడే.. ప్రేమించి మరీ పెద్దలను ఒప్పించి, వివాహం చేసుకున్నారు.
Jyotika - Suriya (Source: Instragram)
ఇక వివాహం తర్వాత భర్త కోసం ముంబై వదిలి చెన్నై షిఫ్ట్ అయిన జ్యోతిక.. ఇక్కడే కుటుంబాన్ని, భర్తను , పిల్లల్ని, భర్తకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటూ సెటిల్ అయిపోయింది.
Jyotika - Suriya (Source: Instragram)
ఇన్నేళ్ల తర్వాత తనకంటూ తన హోమ్ టౌన్ ను, తన స్వేచ్ఛను, తన కోరికలను తిరిగి ఇవ్వాలని ఆలోచించిన సూర్య.. తన భార్యతో సహా ముంబైకి షిఫ్ట్ అయిపోయారు.
Jyotika - Suriya (Source: Instragram)
అక్కడే ఉంటూ తన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు సూర్య. ఇక జ్యోతిక కూడా ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరొకవైపు కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తూ బిజీగా మారిపోయింది.
Jyotika - Suriya (Source: Instragram)
ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట కొల్లాపూర్ లో ఉన్న అత్యంత శక్తి పీఠమైన మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించారు.
Jyotika - Suriya (Source: Instragram)
అక్కడ తమ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నామని, అది సక్సెస్ఫుల్ కావాలని, తమపై అమ్మ వారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని ముడుపు కూడా కట్టింది ఈ జంట. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా జ్యోతిక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.