Big Stories

Vastu Puja :వాస్తు పూజ ఎప్పుడు చేయాలి..

- Advertisement -

Vastu Puja : హిందూమతంలో వాస్తుశాస్త్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇంటికి సంబంధించి కానీ దుకాణం, లేదా కార్యాలయం నిర్మాణానికి సంబంధింది వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు మొదలుపెడుతుంటారు. ఈ సమయంలో వాస్తు పూజ చేయాల్సి చేయాలని విశ్వకర్మ బోధించారు. అలాగే గృహ ప్రవేశం సందర్భంగాను, సంవత్సరాది సమయంలోను , ఇంట్లో సంతానం కలిగిన సమయాల్లో వాస్తు పూజ చేయాలని సూచించారు. ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు ఉపనయం లాంటివి జరిగినప్పుడు ఈ పూజ తప్పనిసరని శాస్త్రం చెబుతోంది. అలాగే శిధిలమైన ఇంటిని మళ్లీ వాడకంలోకి తెచ్చినప్పుడు వాస్తు పూజ చేయిస్తే మంచిది. నివసిస్తున్న ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోయినప్పుడు కూడా ఈ పూజను ఆచరించాలి.

- Advertisement -

ఒకవేళ ఇంట్లోకి గుడ్ల గూబ వచ్చినా, 7 రోజులపాటు కాకి ఇంట్లోనే ఉన్నా అశుభం జరగకుండా ఇంటిని కాపాడుకునేందుకు వాస్తు పూజ దారిచూపిస్తుంది. ఇంట్లో తేనెతుట్టెలు పట్టినా, పావురాలకి నిలయంగా మారినా శుభాశీస్సులు పొందాలంటే ఇదొక్కటే మార్గం. ఊహించని విపత్తులు ఎదురైనా వాస్తుపురుష పూజ చేయాలి. వాస్తుపూజ చేస్తే దరిద్రం, మృత్యువు, విఘ్నాలు కలగవని విశ్వకర్మ చెప్పారు. ఉన్న ఇల్లు కలిసిరానప్పుడు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతున్నా పరిష్కారం కోసం వాస్తుపూజ చేయవచ్చు.

వాస్తు పూజ చేసినప్పుడు ఇంట్లో చెడు శక్తులు బయటికి పోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మళ్లీ గృహాన్ని నింపాల్సి ఉంటుంది . తెలియకుండా వాస్తుపరంగా నిర్మాణ దోషాలు జరిగినప్పుడు వాస్తు శాంతి పూజ చేయించడం శుభకరం. ఇంట్లో కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. వాస్తూపూజతో ఇంటిలోని ప్రతి మూలను శుద్ధి చేయడం జరుగుతుంది. కీలకమైన వాస్తు పూజ చేయడానికి కూడా సమయాన్ని పూజారులను సంప్రదించవచచు. వాస్తు పూజ చేయడానికి తిథి నక్షత్రం చూడాలని పెద్దలు సూచిస్తున్నారు. పంచాంగం ద్వారా పూజకు అనుకూలమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. ఇంట్లోని పెంపుడు జంతువులకి, వాహనాలకు ఇలాంటి పూజ మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News