Sept OTT Movies : ప్రతి నెలా థియేటర్లలో రిలీజ్ అయిన సరికొత్త సినిమాలు అతికొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ లాంటి జానర్లతో ఆడియన్స్ ని అలరిస్తున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2025లో ఓటీటీలో విడుదల కానున్న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల జాబితా గురించిన వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాలు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను అలరించడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఇక వీటిని ఇంట్లోనే చూసి ఎంటర్టైన్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి.
మౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ లో కామెడీ నెక్స్ట్ లెవెల్. థియేటర్లలో అదరహో అన్పించిన ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి ETV విన్‌లో స్ట్రీమ్ కానుంది.
శివకార్తికేయన్ హీరోగా, AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అలా బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆదరణకు నోచుకోని ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో ఓటిటిలోకి రాబోతోందని అంచనా. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ కలసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 2025లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణ పొందినప్పటికీ, పూర్తిగా అంచనాలు అందుకోలేదు. ఈ నెలలోనే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.
రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆగస్టులో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రజనీకాంత్ పవర్ ఫుల్ నటన, స్టైల్‌కు భారీగా ఆదరణ లభించింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ కానుందని అంచనా. అయితే అమెజాన్ ప్రైమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
టైగర్ ష్రాఫ్ హీరోగా, హర్ష ఎ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ యాక్షన్ సినిమా, సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. అదిరిపోయే స్టంట్స్, యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్‌లో సౌత్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ లో హిందీలో స్ట్రీమ్ కానుందని టాక్ నడుస్తోంది
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా, తుషార్ జలోటా దర్శకత్వంలో ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైంది. ఇది సంగీతం, కామెడీ , ఎమోషనల్ కథనంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈ సినిమా అక్టోబర్ చివరి లేదా నవంబర్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ కానుందని అంటున్నారు.
కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, కథాంశంతో థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అక్టోబర్ లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుందని సమాచారం.
వీటితో పాటు మిరాయ్, ఓజి సినిమాలు కూడా అక్టోబర్ ఎండింగ్ లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి