Parag Tyagi : మనుషులు ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఈ క్షణం మనతో మాట్లాడిన వాళ్లే మరుక్షణానికి కనుమరుగవుతారు. కానీ మనకు బాగా దగ్గరైన వాళ్ళు మనకు దూరమైపోతే ఆ వెలితి మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ల జ్ఞాపకాలు ఎప్పుడూ మన మెదడులో పదిలంగా ఉంటాయి. గుర్తొచ్చిన ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్లు భౌతికంగా మనతో లేకపోయినా కూడా ఆత్మీయంగా మనకి ఇప్పుడు దగ్గరగానే ఉంటారు.
ఒక ప్రముఖ నటుడు అచ్చం ఈ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు. టెలివిజన్ మరియు సినిమా నటుడుగా పరాగ్ త్యాగి చాలామందికి సుపరిచితులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన అజ్ఞాతవాసి సినిమాలో కూడా నటుడుగా కనిపించాడు. అలానే హిందీలో కూడా వెడ్నెస్డే (Wednesday) , సర్కార్ (Sarkar) వంటి సినిమాలు చేశాడు. ముఖ్యంగా చాలామంది బాలీవుడ్ టెలివిజన్ ప్రేక్షకులకు పరాగ్ త్యాగి పరిచయం
పరాగ్ త్యాగి భార్య షెఫాలి జరివాలా (Shefali jariwala) . షెఫాలి చనిపోయినప్పుడు డ్రగ్స్ వలన చనిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆవిడ అలా చనిపోలేదు అటువంటి అలవాట్లు ఆవిడకి లేదు అంటూ అన్ని వార్తలను కొట్టి పడేసాడు పరాగ్ త్యాగి. షెఫాలి జరివాలా మరియు పరాగ్ నాచ్ బలియే (Nach Baliye) అని ఒక డాన్స్ సోలో పాల్గొన్నారు. షెఫాలి జరివాలా జూన్ 27న మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నాడట పరాగ్ త్యాగి.
మామూలుగా కొంతమంది చనిపోతే వాళ్లకు సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవడానికి పెద్దగా ఎవరు అంగీకారం తెలపరు. వాళ్ల జ్ఞాపకాలు వెంటాడుతాయి అని భయంతో ఉంటారు. కానీ పరాగ్ త్యాగి చాలా డిఫరెంట్. ఇప్పటికీ తన భార్య మీద ఉన్న ప్రేమను విడువలేకున్నాడు. ఇక రీసెంట్ గా తాను స్వయంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. ఇప్పటికీ కూడా షెఫాలి జరివాలా బ్రష్ తోనే పరాగ్ త్యాగి పళ్ళు తోముకుంటున్నాడట. అలానే ఆమె దిండు పైనే పడుకుంటున్నాడట. పడుకునేటప్పుడు కూడా అతని పక్కలో షెఫాలి జరివాలా బట్టలను పెట్టుకుంటున్నట్లు ఆ పాడ్ కాస్ట్ లో తెలిపాడు.
Also Read : 12 Years For Attharintiki Daredhi : లీకైన సినిమాతో ఆల్ టైం రికార్డ్ పెట్టావ్, పొలిటికల్ ఎంట్రీ శాపమైందా?