BigTV English

Moksha Narayana Bali Puja : మోక్షనారాయణ బలి పూజ ఎవరు చేయాలి.?

Moksha Narayana Bali Puja : మోక్షనారాయణ బలి పూజ ఎవరు చేయాలి.?
Moksha Narayana Bali Puja


Moksha Narayana Bali Puja : పంచ మహా పాతకాలను తొలగించుకోవడానికి మోక్ష నారాయణ బలి పూజ నిర్వహిస్తారు. ప్రత్యేకించి, కుటుంబంలో అసహజ మరణం జరిగినా మోక్ష నారాయణ పూజ చేయాలని గరుడ పురాణం చెబుతోంది. నీటిలో మునిగి చనిపోవడం, మంటల్లో కాలిపోవడ, అనారోగ్యంతో మృత్యువాత పడటం, పాముకాటుకు గురై చనిపోవడం, ఆత్మహత్య ఇలాంటవన్నీ శాపాల వల్ల కూడా జరుగుతాయి..
అదే విధంగా పితృదేవతలకి పద్దతి ప్రకారం అపరకర్మలు , శ్రాద్ధ కర్మలు చేయకపోతే, నిర్వహించలేకపోతే మోక్ష నారాయణ పూజ చేయవచ్చు. దీనివల్ల పితృ దేవతలు తృప్తి పొందుతారని విశ్వాసం.ఈపూజ చేయడం వల్ల పితృదేవతలు పుణ్యలోకాలకి చేరతారు.

ఈ మోక్ష నారాయణ బలి పూజను పవిత్రమైన నది ఒడ్డున మాత్రమే నిర్వహించాలి. పూజను చాలా శాస్త్రోక్తంగానే నిర్వహించాలి. ఉత్తమమైన బ్రాహ్మణుల పర్యవేక్షణలో జరిగాలి. ప్రధాన సంకల్పం, గణపతి పూజ, కలశ స్థాపన, బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర, యమ దేవతల ఆవాహన, ఆరాధన, పిండ ప్రదానం తదితర క్రతువు ఉంటుంది . తరువాత హోమ క్రతువు, దానాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తారు. వేదవిదురులైన బ్రాహ్మణుల పర్యవేక్షణలో స్వయంగా స్వహస్తాలతో ఈ పూజని నిర్వహించాలి. ఈ మోక్ష నారాయణ బలి పూజని నిర్వహించడానికి అనుకూలమైన ముహూర్తాలు ఆశ్లేష, ఆరుద్ర, పుష్యమి నక్షత్రాలతో కూడి ఉంటే మంచిది. అలాగే పౌర్ణమి, అమావాస్య తిధులు గొప్ప ఫలాన్నిస్తాయి.


చనిపోయిన వారి కోసమే మాత్రమే పూజ చేస్తుంటారు. బతికున్న వారికి ఈ పూజ చేయడం మహా అపరాథమని పండితులు చెబుతున్నారు. తండ్రి ఉన్న వారు ఈ పూజను చేయకూడదు. తలకొరివి పెట్టేవారు లేక కర్మకాండలు జరిగిన వారి కోసం కూడా ఈపూజను చేయించవచ్చు. పితృశాపాలు ఉన్న వారు కూడా ఈ పూజను ఆచరించవచ్చు

Related News

Ganesh Chathurthi 2025: మొదటి సారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ నియమాలు తప్పనిసరి !

Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆశీర్వాదాలకు దూరమే!

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Big Stories

×