BigTV English

Tamanna Bhatia Latest News : హీరోతో ప్రేమ.. కన్ఫర్మ్ చేసిన మిల్కీ బ్యూటీ..

Tamanna Bhatia Latest News : హీరోతో ప్రేమ.. కన్ఫర్మ్ చేసిన మిల్కీ బ్యూటీ..


Tamanna Bhatia Latest News : ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకోవడం చాలా అరుదు. హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చినా కూడా అందులో కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళ్లేవి. కానీ ఈరోజుల్లో అలా కాదు.. హీరో, హీరోయిన్లు సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించుకొని విడిపోకుండా తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తను ఒక హీరోతో ప్రేమలో ఉన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

తమన్నా బాటియా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీలో ముద్దు పెట్టుకున్న వీడియో అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలుమార్లు వీరు డేట్‌కు వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. అయినా కూడా ఇప్పటివరకు వీరు దీని గురించి ఏమీ స్పందించలేదు. తాజాగా తమన్నా.. విజయ్ వర్మ అంటే తనకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం తమన్నా తను నటించిన ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అదే సమయంలో తనకు విజయ్ విర్మ గురించి ప్రశ్న ఎదురయ్యింది. విజయ్ వర్మకు తన మనసులో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చింది తమన్నా. అతను తనకొక హ్యాపీ ప్లేస్‌లాగా అని విజయ్ విర్మపై ఇష్టాన్ని బయటపెట్టింది. ఒక మనిషితో కలిసి నటిస్తే మాత్రం వారి మీద ఇష్టం రాదని, తనకు ఇంతకు ముందు కూడా పలు యాక్టర్లతో మంచి స్నేహం ఉందని తెలిపింది. కానీ ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడే ఒక మనిషితో ఎమోషనల్‌గా కలుస్తామని చెప్పింది.

తమన్నా చెప్పిన మాటలను బట్టి విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉందనే అనిపిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొందరైతే ఈ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా తమన్నా క్రేజ్, తనకు వస్తున్న ఆఫర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తన చేతిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ కూడా జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×