BigTV English
Advertisement

MataTrayay Ekadashi : మత త్రయఏకాదశి ప్రత్యేకత ఇదే

MataTrayay Ekadashi : మత త్రయఏకాదశి ప్రత్యేకత ఇదే
MataTrayay Ekadashi


MataTrayay Ekadashi : హిందూ మతంలో దేవుడి ఆరాధనకి మూడు వర్ణాలు ఏర్పడ్డాయి. ఏకాదశి తిథి రోజు మహావిష్ణువును ప్రత్యేకంగా స్మరించుకుంటాం. ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాన్ని పఠించడం , ధానధర్మాల వల్ల ఏకాదశి పూజ ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. ప్రతీ ఏకాదశినాడు ఇలా పూజ చేస్తే మరణాంతరం పుణ్య లోకాలకి చేరుతామని విష్ణు పురాణం ఘోషిస్తోంది. అయితే ఈ నెల 14న మత త్రయ ఏకాదశి వచ్చింది. హిందూమతంలో భగవంతుడ్నిసేవించడంలో కూడా మూడు వర్ణాలు ఏర్పడ్డాయి. విష్ణువు ఆరాధనలో భాగంగా మతత్రయ ఏకాదశిని ఈ మూడు వర్ణాలు కచ్చితంగా ఆచరిస్తాయి.అందుకే మత త్రయోదశి పేరు వచ్చింది.

మహా విష్ణువుని ఆరాధించేందుకు ఎన్నో పద్దతులు , విధానాలు ఉన్నాయి. కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు. మంచి నీళ్లు కూడా సేవించకుండా రోజంతా ఉపవాసం ఉండి దేవుడ్ని ఆరాధిస్తారు. కానీ అలా చేయడం సరికాదన్న భావన ఉంది. శరీరాన్ని కష్టపెట్టి పూజ చేయడం సరికాదని..పాలు, పండ్లు తీసుకుని ఉపవాసం చేయవచ్చని వాయు పురాణం చెబుతోంది. ఇవాళ్టి రోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. అలా చేయలేని వాళ్లు కనీసం రాముడి నామాన్ని జపించినా ఫలితం దక్కుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి ఘడియలు ఉండగా భోజనం చేయాలి. అది కూడా సాత్వికమైన ఆహారం మాత్రమీ తీసుకోవాలి.


ద్వాదశి రోజున విష్ణు భక్తుల్ని మీ శక్తిమేర పిలిచి వారికి భోజనం వడ్డించాలి. తర్వాత మనం భోజనం చేస్తే వత్ర ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. ఏకాదశి రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండటం వల్ల విష్ణు కటాక్షం ఎక్కువ లభిస్తుందని నమ్మకం. ఏడాదిలో 24 ఏకాదశలు వస్తాయి. అందులో ప్రతీ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాది ఒక్కరోజైన పూర్తిగా భగవన్మామసర్మణకు కేటాయించాలని శాస్త్రం చెబుతోంది. ఇవాళ శివ, కేశవుల్ని ఇద్దర్ని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×