
Brahma : త్రిమూర్తులు త్రిగుణాత్మకులు. సృష్టి,స్థితి,లయలకు అధిష్టాన దేవతలు. రక్షణ ఇచ్చే విష్ణువును పూజించడం ద్వారా భద్రతను, శ్రీ మహాలక్ష్మి ఇచ్చే ధనం ద్వారా సుఖాలనూ పొందడానికి లక్ష్మీదేవిని ప్రార్ధిస్తుంటాం. మహాశివుడు లయకారకుడు. మరణమంటే మానవునికి భయం. అందుకే అలాంటి మృత్యు భయాన్ని పోగోట్టి మృత్యువును దూరంగా ఉంచమని శివుడ్ని ప్రార్ధిస్తుంటాం. బ్రహ్మ సృష్టించేవాడు. మనల్ని ఆయన ఎప్పుడో పుట్టించేశాడు. మళ్లీ ఆయన్ను అడగడానికి ఏముంటుంది. ?ఆయన దగ్గరేముంది.? అందుకే బ్రహ్మను పూజించడానికి ఎవరూ రారు. కానీ మోక్షమనే పరబ్రహ్మ దర్శనం సిద్ధించేది బ్రహ్మవరం వల్లనే.
బ్రహ్మదేవుడికి పూజలు చేయకపోవడం వెనుక మరో కథ కూడా ఉంది. ఒకసారి శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు, చివరి భాగాన్ని శ్రీమహా విష్ణువు చూసి రావాలని పందేం వేసుకున్నారట.దేవతల సాక్షిగా ఇద్దరూ బయలు దేరారు. బ్రహ్మ ఎంత దూరం ప్రయాణించినా శివలింగం ముందు భాగం కనిపించలేదట. విష్ణువుకు కూడా చివరి భాగం కనిపించలేదు. కానీ బ్రహ్మదేవుడు దారి మధ్యలో దేవలోకపూ గోవు, మొగలి చెట్టూ కనిపించాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్టు దేవతలకి సాక్ష్యం చెప్పాలని కోరగా అలాగేనని సాక్ష్యం చెబుతారు.
దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడినే విజేతగా నిర్ణయిస్తారు. అదే సమయంలో ఆకాణవాణి జరిగిన విషయాన్ని శ్రీమహా విష్ణువుకి చెప్పాయి. దీంతో అసత్యం పలికిన బ్రహ్మకి కలియుగంలో పూజలు ఉండవని, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకి పనికిరాదని దోషమని శాపం విధించాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి పూజలు లేవట.