
Thangalaan: పొన్నియిన్ సెల్వన్ మూవీలో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న విక్రమ్ ఆ తరువాత మరొక భారీ ప్రయోగాత్మకమైన చిత్రానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఎప్పుడు తన సినిమాలలో కొత్తదనానికి ప్రయత్నించే విక్రమ్ ఈసారి తను నటించబోయే 61వ చిత్రం లో కూడా అదే చేశారు. తంగలాన్.. అనే టైటిల్ తో వచ్చే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ విపరీతమైన స్పందన సొంతం చేసుకుంది.
ఈ టైటిల్ పలు రకాల సందేహాలు రేకెత్తగా.. ఈ మూవీలో విక్రమ్ పాత్ర పేరుని టైటిల్ గా పెట్టడం జరిగిందని నిర్మాత స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ మూవీలో విక్రమ్ పాత్రను “తంగలాన్” అని పిలుస్తారని.. అందుకే మూవీకి ఆ టైటిల్ పెట్టడం జరిగిందని వెల్లడించారు. ఇక ఈ చిత్రం స్వాతంత్రానికి ముందు జరిగిన కొన్ని పరిస్థితుల బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో విక్రమ్ తో పాటు మిగిలిన పాత్రలను రగ్డ్ లుక్‌తో చూపించారు.
ఇప్పటికే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ కేజీఎఫ్ పుణ్యమా అని అందరికీ బాగా అవగాహన ఉన్న కాన్సెప్ట్. అయితే ఈ మూవీ బ్రిటిష్ పాలన సమయం లో కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలో పనిచేసిన వ్యక్తుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల పై ఆధారపడి ఉంటుంది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడానికి .. డైరక్టర్ పా రంజిత్ సుమారు నాలుగు సంవత్సరాలు వర్క్ చేశారు . దీని బట్టి స్క్రిప్ట్ ఎంత ఇంటెన్సిటీ తో ఉంటుందో అర్దం అవుతుంది.
ఇక ఈ మూవీ నుంచి విడుదలైన విక్రమ్ రగ్డ్ లుక్ కి చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. గుబురు గడ్డంతో, మాసిన జుట్టుతో.. ఒక అఘోరా టైపులో కనిపిస్తున్నాడు విక్రమ్. .ఈ మూవీ లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ఈమె ఎంతో బలమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడికల్ స్టోరీ తో సాగే ఈ మూవీ లో హీరోయిన్ కు ఒక అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చే స్కోప్ ఉందట. ఈ మూవీ ను తన మిగిలిన మూవీస్ కు భిన్నంగా చాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు పా రంజిత్.
ఈ మూవీ 3Dలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ మూవీలో చియాన్ విక్రమ్ వేషధారణ, నటన.. అతను ఒకప్పుడు నటించిన శివ పుత్రుడు మూవీ ను మించి ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంచనా. అలాగే ఈ మూవీకి కచ్చితంగా విక్రమ్ జాతీయ అవార్డు దక్కించుకుంటాడు అని ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నవంబర్ 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
Manchu Lakshmi: ఈ విషయాన్ని రచ్చ చేయొద్దు ప్లీజ్.. విష్ణు, మనోజ్‌ల గొడవపై లక్ష్మీ రియాక్షన్ ఇదే..