BigTV English
Advertisement

Dharma Sandehalu:పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరించాలి

Dharma Sandehalu:పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరించాలి

Dharma Sandehalu:పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం హిందూ సంప్రదాయం. పెద్దలకు నమస్కరించడం శక్తివంతమైన గొప్ప అనుభూతి కలుగుతుంది. అలా చేయడం వెనుకున్న పరమార్థం ఏంటంటే..మన శరీరంలో తల ఉత్తర ధృవం అయితే పాదాలు దక్షిణ ధృవం. వ్యతిరేక ధృవాలే ఆకర్షించుకుంటాయి. అప్పుడే శక్తి విడుదల అవుతుంది. అలానే పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోనేటపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆ సమయంలో వారి పాదాల్లోని దక్షిణ ధృవం మన తలలోని ఉత్తర ధృవంతో ఆకర్షితమై శక్తిని ప్రసరిస్తుంది.
అందుకే భారతీయ హిందు సంప్రదాయంలో పెద్దల కాళ్ళకు నమస్కరించే ఆచారాన్ని పెట్టారు..


హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ ఓ పరమార్థం దాగి ఉంటుంది. పెద్దలు ఎంత ఆలోచించి ఈ పద్ధతులు పెట్టారో అర్థమవుతుంది. ఒకప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించేవాళ్లు. అలాగే ఎక్కడికైనా వెళ్లే ముందు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని అరకొరగా పాటించేవాళ్లే కనిపిస్తున్నారు.

పెద్దవాళ్లు.. మనకంటే ఎక్కువ కాలం బతికారు. అంటే వాళ్లు ఎంతో అనుభవాన్ని గడించారు. వాళ్ల అనుభవానికి.. వారు వారి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లకు.. వాటిని అధిగమించి జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు వారి పాదాలకు నమస్కరించడంలో తప్పులేదు. పెద్ద వాళ్ల పాదాలకు నమస్కరించడమంటే.. మన అహాన్ని వదిలి పెద్దల మార్గాన్ని అనుసరిస్తున్నామని అర్థం. అంటమనల్ని మనం తక్కువ చేసుకోకుండా.. వారి అనుభవానికి.. వారి వయస్సుకి గౌరవం ఇవ్వడం. .పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంప్రదాయం అని.. మహాభారతం, అధర్వణ వేదంలో వివరించారు. మహాభారతంలో యుధిష్ఠిరుడు పాదాలకు నమస్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించారట.


పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించినప్పుడు ఎడమ చేతిని ఎడమ కాలిపై.. కుడి చేతిని కుడి కాలిపై పెట్టి నమస్కరించడం అనేది సరైంది కాదని పండితులు చెబుతుంటారు. అలా కాకుండా.. కుడిచేతిని వారి ఎడమకాలిపై, ఎడమచేతిని కుడికాలిపై పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలని అంటుంటారు.

Pooja:దేవుడి పవళింపు సేవలో ఉన్నప్పుడు పూజ చేయచ్చా…

Thiruvanaikal Temple:మార్మోగుతున్న తిరువానైకల్ ఆలయం పేరు ఎందుకంటే..

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×