E-Paper
Advertisement

Miss Shetty.. Mr. Polishetty: సాంగ్ రిలీజ్.. అనుష్క గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా…

Miss Shetty.. Mr. Polishetty: సాంగ్ రిలీజ్.. అనుష్క గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా…
Advertisement

Miss Shetty.. Mr. Polishetty: అనుష్క సౌతిండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. ఏజ్ పెరిగినా తరగని అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 41 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ గ్లామర్ క్వీన్ గానే ఉంది. రెండున్నర ఏళ్లుగా ఆమె వెండితెరపై కనిపించలేదు. చివరి సారిగా నిశ్శబ్దం మూవీలో తెరపై మెరిసింది. కానీ ఇప్పుడు మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి మూవీతో సినీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో నో..నో..నో.. పాటను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో అనుష్క గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాస్త బొద్దుగా కనిపించినా ముద్దుగా ఉందని అంటున్నారు. ఆమె ఒంపుసొంపులు వన్నెతరగలేదని ఈ సాంగ్ నిరూపిస్తోంది. ఆ చూపులు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి.

మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టిలో హీరో నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా పరిచయమైన నవీన్ మంచి కామెడీ టైమింగ్ తో అభిమానులను సంపాదించుకున్నాడు. జాతిరత్నాలు మూవీతో అతని రేంజ్ పెరిగిపోయింది. జాతిరత్నాలు మూవీ తర్వాత ఈ యువహీరో నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కాంబినేషన్ కు క్రేజ్ వచ్చింది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు వంశీ – ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ మూవీని మహేష్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ సమ్మర్ సీజన్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ రాబోతోంది.

ఈ చిత్రంలో కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలో నటిస్తున్నాడు. కథానాయిక అనుష్క… షెఫ్‌ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి రధన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. మహిళా దినోత్సవం రోజు అనుష్క కొత్త లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు ఉగాది సందర్భంగా నో..నో..నో.. పాటను రిలీజ్ చేసింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×