ప్రథమ దృష్టియా కుట్టక్కర్ (Pradhama Drishtiya Kuttakkar).. ఇది రీసెంట్గా ఓటీటీలో విడుదలైన మళయాల థ్రిల్లర్ మూవీ. పార్వతి తిరువోతు ప్రధాన పాత్ర పోషించారు. చూడగానే నేరగాన్ని పట్టేస్తా! అనే తెలుగు అర్థం వచ్చే సినిమా పేరు ఇది. ఈ సినిమా కథ.. ఏపీలో జరిగిన సాయికృష్ణ లాకప్‌డెత్ సంఘటన రెండూ ఒకేలా ఉంటాయి. ఆ సినిమాకు ఇదే ప్రాధాన ఆత్మ.
కానీ ఇది కాకతాళీయమే తప్ప. ఈ ఏపీ లాకప్‌డెత్ కేసు ఆధారంగా తీసిన సినిమా కాదిది. ఎందుకంటే.. ఈ సినిమా స్టోరీ, ఏపీ సంఘటన కన్నా ముందుగా అనుకున్నది. షూటింగ్ జరుపుకున్నది కూడా. ‘దృశ్యం’ సినిమాను తలపించేలా సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఉందనే విధంగా మనం గతంలో అనుకున్నాం. శవాన్ని కూడా దొరకనీయకుండా పోలీసులను ముప్పు తిప్పులు పెట్టి తప్పించుకునే ఆ దృశ్యం సినిమా కథలో లాగే .. సాయికృష్ణ లాకప్ డెత్ సంఘటనలు కొన్ని సరిపోలి ఉన్నాయి.
కానీ, తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ ప్రథమ దృష్టియా కుట్టకర్ అనే ఈ తమిళ థ్రిల్లర్ ఇంకా దగ్గరగా .. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగి ఉంటుంది? పోలీసుల దాడిలో చనిపోయిన ఆ నిందితుడిని ఏం చేశారు..? ఆధారాలు దొరకుండా ఎలాంటి వ్యూహాలు పన్నారు? చేసింది తప్పని తెలుసు. కానీ దాన్ని దాచేందుకు.. చట్టం నుంచి బయటపడేందుకు ఏమేమి ట్రిక్కులు ఉపయోగించారో ఆ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్ కథనంతో చూపారు.
ఏపీలో జరిగిన వాస్తవ ఘటనలు యథాతథంగా లేకపోయినప్పటికీ.. పోలీస్ స్టేషన్లో జరిగిన దాడి, నిందితుడి మరణం.. సాక్ష్యాలు చెరిపేయడం, ఉన్నతాధికారుల ఇన్విస్టిగేషన్‌కు చిక్కకుండా చుక్కలు చూపించడం, చట్టానికి దొరకుండా ఉండేందుకు కొత్త టెక్నిక్‌లు ఉపయోగించడం .. ఈ అంశాలు ఒకేలా అనిపిస్తాయి.
ఏపీ రాజకీయాల్లో సాయికృష్ణ లాకప్‌డెత్ ఇష్యూ సంచలనం రేకెత్తించింది. ప్రభుత్వానికి కొత్త తలవంపులు తెచ్చిపెట్టింది. దీనిపై ప్రభుత్వం సిట్ వేసి.. ఆ పోలీసుల చర్యపై ఓ క్లారిటీకి వచ్చినా.. సర్కార్‌కు మాత్రం ఓ మచ్చగానే మిగిలిపోయింది ఈ కేసు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసి కాల్చి బూడిద చేసిన పోలీసులు.. సీసీ పుటేజీలను మాయం చేశారు. ఆ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా రంగులేశారు. ఈ సినిమాలో కూడా ఆధారాలు దొరకుండా సీసీ పుటేజీలు దొరకుండా ఇన్విస్టిగేషన్ ప్రక్రియను తప్పుదారి పట్టిస్తారు.
ఎంతో సీనియర్ అయిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసిన బుక్కు ఆధారంగానే ఈ కేసు నుంచి బయటపడేందుకు పార్వతి పాత్ర చివర వరకు ప్రయత్నించి పైచేయి సాధిస్తుంది. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులు తాము చేసిన తప్పును ఒప్పుకుంటారు. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌కూ ఈ విషయం తెలుసు. కానీ దీన్ని చట్టం ముందు నిరూపించేందుకు ఆ ఆఫీసర్.. చట్టానికి దొరకుండా ఈ పార్వతి పోలీసు పాత్ర ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగే కథనమే ఈ మళయాల థ్రిల్లర్.
ఈ సినిమా చూస్తున్న తెలుగు జనానికెవరికైనా .. ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసు.. కచ్చితంగా ఓసారి వారి స్మృతిపథంలో మెదలడం మాత్రం పక్కా.