E-Paper
Advertisement

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది
Advertisement

Suresh Raina On Bollinger wig:  చెన్నై సూపర్ కింగ్స్ (C S K) స్టార్ ఆటగాడు, మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా (Suresh Raina) ఒకప్పుడు స్టార్ ఆటగాడిగా కొనసాగుతూ, బౌలర్లకు నరకం చూపించేవారు. టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన సురేష్ రైనా…ఎన్నో రికార్డులు సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) ప్రియ శిష్యుడిగా చెన్నై సూపర్ కింగ్స్ లో ( CSK) కొనసాగిన సురేష్ రైనా… 2021 తర్వాత ఆ జట్టుకు గుడ్ బై చెప్పారు. తన కుటుంబ సభ్యుల విషాద సంఘటన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును వీడారు రైనా. దాదాపు 10 సంవత్సరాల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సేవలు అందించిన ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించారు సురేష్ రైనా. అలాంటి సురేష్ రైనా తాజాగా మాజీ చెన్నై బౌలర్ డగ్ బోలింగర్ ( Doug Bollinger) విగ్గు ( Wig) ఇన్సిడెంట్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.

వికెట్ పడిన ఆనందంలో జట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సురేష్ రైనా… కపిల్ శర్మ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జరిగిన ఫన్నీ సన్నివేశాల గురించి సురేష్ రైనాను అడిగారు కపిల్ శర్మ. ముఖ్యంగా వికెట్లు తీసిన తర్వాత బౌలర్ జుట్టు పీకుతావు కదా ? అంటూ సురేష్ రైనాను ప్రశ్నించాడు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ డగ్ బోలింగర్ విగ్ ఇన్సిడెంట్ ను రివిల్ చేశారు సురేష్ రైనా. ఒకానొక సమయంలో సౌరవ్ గంగూలీ వికెట్ ను డగ్ బోలింగర్ పడగొట్టాడని గుర్తు చేశారు సురేష్ రైనా.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

ఈ సందర్భంగా ఆనందంతో తాను వేగంగా వెళ్లి డగ్ బోలింగర్  ( Doug Bollinger wig ) జుట్టును పీకానని తెలిపారు. అయితే తాను జుట్టు పట్టి లాగడంతో, విగ్గు ( Doug Bollinger wig ) పూర్తిగా ఊడిపోయిందని వివరించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వాలని.. ఈ క్రమంలో డగ్ బోలింగర్ ఆ సన్నివేశాన్ని అవమానంగా భావించినట్లు తెలిపారు. అయితే అతడిది నిజమైన హెయిర్ అనుకోని తాను పీకానని… విగ్ అని బయటపడే వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు ఈ విషయం తెలియదన్నారు. ఈ సంఘటన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన తాను… డగ్ బోలింగర్ కు క్షమాపణలు చెప్పినట్లు వివరించారు. దీంతో వివాదం అక్కడితో సద్దుమణిగిందని తెలిపారు సురేష్ రైనా ( Suresh Raina).

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Big Stories

Advertisement
×