E-Paper
Advertisement

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ

Aay Movie: ఆయ్.. ఓటీటీలోకి వచ్చేస్తున్నామండీ
Advertisement

Aay Movie: ఎన్టీఆర్ బామర్దిగా  మ్యాడ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నార్నే నితిన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నితిన్.. అందరి హీరోల్లా కాకుండా కథలను ఆచితూచి ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.

మ్యాడ్ తరువాత నితిన్ నటించిన చిత్రం ఆయ్. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు.ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

అదే రోజు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు చిన్న సినిమా అయిన ఆయ్ నే ఆదరించారు. కథలో అంత బలం ఉంది కాబట్టే రెండు పెద్ద సినిమాలు వస్తున్నా బెదరకుండా రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే మంచి విజయం తో పాటు రికార్డ్ కలక్షన్స్ ను కూడా అందుకుంది.

ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్  గుడ్ న్యూస్ తెలిపారు. నేడు వినాయక చవితి పండగ సందర్భంగా ఆయా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ.. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయ్ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Advertisement

ఇక ఆయ్ సినిమా సెప్టెంబర్ 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్ లో హిట్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలోఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×