E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: ఎవరీ ఛాయాదేవి.. సూర్యకు ఏమవుతుంది.. ?

Saripodhaa Sanivaaram: ఎవరీ ఛాయాదేవి.. సూర్యకు ఏమవుతుంది.. ?
Advertisement

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ప్రతి శనివారం ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ను ఇస్తూ మేకర్స్ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. అయితే ఇంకా శనివారం రాకముందే సరిపోదా శనివారం నుంచి అప్డేట్ ను అందించారు మేకర్స్. నేడు అభిరామి పుట్టినరోజు కావడంతో.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక అభిరామి గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందించినా అమ్మడికి అవకాశాలు దక్కకపోవడంతో తెలుగులో అంతగా కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత అభిరామి ఈ సినిమాతో ఈ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మహారాజా సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మెరిసిన అభిరామి.. సరిపోదా శనివారం సినిమాలో ఛాయాదేవి అనే పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు.

నిండైన చీరకట్టు, నుదుటున బొట్టు పెట్టుకొని.. గుమ్మం ఎదుట భర్త కోసం ఎదురుచూస్తున్న భార్యలా ఆమె కనిపించింది. అసలు ఈ ఛాయాదేవి ఎవరు.. ? నానికి అక్కనా..? వదిననా .. ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈసారి అభిరామికి మంచి పాత్రనే దొరికినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అభిరామి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×