E-Paper
Advertisement

Actor Jeeva: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు

Actor Jeeva: హీరో జీవాకు రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు
Advertisement

Actor Jeeva: కోలీవుడ్ హీరో  జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  చెన్నై నుంచి సేలం వైపు ఆయన కారులో  తన భార్యతో పాటు  ప్రయాణిస్తుండగా    కన్నియమూర్ వద్ద   ఒక బైక్  ను తప్పించే ప్రయత్నంలో   కారు పక్కనే ఉన్న బారికేడ్ ను ఢీ  కొట్టింది.

ఇక ఈ ప్రమాదంలో జీవా, ఆయన భార్య సుప్రియ చిన్న చిన్న గాయాలతో బయటపడగా.. కారు నుజ్జు నుజ్జు అయ్యిందని తెలుస్తోంది.  వెంటనే ఈ జంటను ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.  ఇక తమిళ్ హీరో జీవా గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన  అవసరం లేదు.

Advertisement

రంగం సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యిన జీవా.. ఆ తరువాత స్నేహితుడు లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ  ఏడాది యాత్ర 2 సినిమాతో మరింత చేరువ అయ్యాడు. జగన్ బయోపిక్  గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహి వి రాఘవ  దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జగన్ గా జీవా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జీవాకు  రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా  కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×