E-Paper
Advertisement

Actor Rajasekhar : ఆ రోల్స్ చేస్తే .. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ సెట్..

Actor Rajasekhar : ఆ రోల్స్ చేస్తే .. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ సెట్..
Advertisement

Actor Rajasekhar : ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తన డాషింగ్ లుక్స్ తో ఆకట్టుకున్న హీరో రాజశేఖర్. నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రనైనా తనదైన శైలిలో హైలైట్ చేయడం తన స్పెషాలిటీ. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాజశేఖర్ నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ లో రాజశేఖర్ ఫన్నీ డైలాగ్.. కామెడీ యాంగిల్ ప్రతి ఒక్కరిని అలరించింది. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ తిరిగి పాత స్టైల్ లో కనిపించాడు అంటున్నారు అభిమానులు.

ఒక్క డైలాగ్ తో ఈ మూవీలో రాజశేఖర్ పాత్ర ఫన్నీ యాంగిల్ లో డిజైన్ చేశారని అర్థమవుతుంది. ఫస్ట్ లో ఈ మూవీలో రాజశేఖర్ నటిస్తున్నారు అన్నప్పుడు పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లేదా పొలిటీషియన్ పాత్రలో రాజశేఖర్ కనిపిస్తాడేమో అని అందరూ భావించారు. అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. మరోపక్క తెలుగు సినిమాల్లో కమెడియన్ గా పనిచేసిన సునీల్ లాంటి నటులు పర భాషల్లో విలన్స్ గా సాలిడ్ గా సెటిల్ అయిపోయారు.

Advertisement

ఏ నేపథ్యంలో కొందరు రాజశేఖర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా విలన్ గా ట్రై చేస్తే అది అతనికి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ల కొరత బాగానే కనిపిస్తుంది. రాజశేఖర్ లాంటి విలక్షణ నటుడు విలన్ పాత్రలో మరింత మెప్పిస్తాడు. ఎలాగో టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోలుగా కంటిన్యూ అయినా జగపతిబాబు, శ్రీకాంత్ ప్రస్తుతం విలన్లుగా మంచి ఆఫర్స్ దక్కించుకుంటున్నారు.

దీంతో రాజశేఖర్ కూడా అదే దారిలో అడుగులు వేస్తే మంచిదని అభిమానులు ఆశిస్తున్నారు.ప్రస్తుతం రాజశేఖర్ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు టాక్. ఈ నేపథ్యంలో విలన్ రోల్స్ చేయడం మొదలుపెడితే రాజశేఖర్ కు ఆఫర్స్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం. ఇక ప్రస్తుతం రాజశేఖర్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ చూడడం కోసం అతని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×