BigTV English

Adipurush: ‘ఆదిపురుష్’లో సోనాల్.. చిన్న పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్..

Adipurush: ‘ఆదిపురుష్’లో సోనాల్.. చిన్న పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్..
Adipurush: ‘ఆదిపురుష్’లో సోనాల్.. చిన్న పాత్ర కోసం భారీ రెమ్యునరేషన్..


Adipurush: ఒకప్పుడు సినిమాల్లో గెస్ట్ రోల్స్‌కు చాలా క్రేజ్ ఉండేది. తమకు ఇష్టమైన నటీనటుల సరసన కాసేపు నటించడం కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా హీరోలు, హీరోయిన్లు ముందుకొచ్చేవారు. కానీ ఈరోజుల్లో అలా కాదు.. చాలావరకు గెస్ట్ రోల్స్‌కు, చిన్న చిన్న పాత్రలకు కూడా రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారు కొందరు నటీనటులు. తాజాగా సోనాల్ చౌహాన్ కూడా అలాగే చేసింది.

‘ఆదిపురుష్’ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను రంగంలోకి దించాడు ఓం రౌత్. చిన్న చిన్న పాత్రల కోసం కూడా క్రేజ్ ఉన్న నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. అలాగే మండోదరి పాత్ర కోసం సోనాల్ చౌహాన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో తాను భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్‌లో నటిస్తున్నానంటూ సోనాల్ ఆనందానికి అవధులు లేవు. కానీ సినిమాలో చూస్తే తన పాత్ర నిడివి 2 నిమిషాలు కూడా లేదు.

ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన సోనాల్.. హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. ఆపై తెలుగులో కూడా పరిచయమయ్యింది. తెలుగులో సీనియర్ హీరో బాలయ్య సరసన రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. హాట్ బ్యూటీ సోనాల్.. కేవలం యంగ్ హీరోలతో మాత్రమే కాదు సీనియర్ హీరోలతో కూడా కెమిస్ట్రీ బాగా పండించగలదు అని ప్రూవ్ చేసుకుంది.

సోనాల్ చౌహాన్ ఎన్ని సినిమాలు చేసినా.. కొందరు హీరోయిన్లతో పోలిస్తే తనకు ఉన్న క్రేజ్ తక్కువే. కానీ ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ రాగానే 2 నిమిషాల పాత్ర కోసం రూ.50 లక్షలు ఛార్జ్ చేసిందట ఈ హాట్ బ్యూటీ. తన పాత్రను తెరపై చూసినవారు ఈ మాత్రం నటించడం కోసం అంత రెమ్యునరేషన్ తీసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈరోజుల్లో గెస్ట్ పాత్రలకే డిమాండ్ ఎక్కువగా ఉందంటూ విమర్శిస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×