E-Paper
Advertisement

Akkineni Nagarjuna: కల్కి సెట్ లో నాగ్ ఏం చేస్తున్నాడు.. ?

Akkineni Nagarjuna: కల్కి సెట్ లో నాగ్ ఏం చేస్తున్నాడు.. ?
Advertisement

Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున కల్కి సెట్ లో ఏం చేస్తున్నాడు..? కల్కి 2 లో నాగ్ కూడా ఉన్నాడా.. ? అంటే ఏమో ఉన్నా ఆశ్చర్యం లేదు అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. నేడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో.. ఆయనకు బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా వైజయంతీ మూవీ మేకర్స్ .. కల్కి సెట్ లో నాగ్ సందడి చేసిన కొన్ని పోటోలను షేర్ చేస్తూ నాగార్జునకు బర్త్ డే విషెస్ తెలిపారు. నిర్మాతలు అశ్వినీదత్ , స్వప్న దత్ తో పాటు నాగార్జున కూడా కల్కి సెట్ లో కనిపించాడు. దీంతో కల్కికి.. నాగ్ కు ఏమైనా సంబంధం ఉందా.. ? అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. కల్కి లో కొంత భాగం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిందంట. ఆ సమయంలోనే నాగార్జున..  కల్కి సెట్ కు వచ్చి మేకర్స్ ను కలిసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చుసిన అభిమానులు నాగ్ ను కూడా కల్కి 2 లో భాగం చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇకపోతే వైజయంతీ మూవీ మేకర్స్ కు నాగ్ కు విడదీయరాని బంధం ఉంది.  వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ ఎన్నో మంచి చిత్రాలు చేశాడు. ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా, రావోయి చందమామ, ఆజాద్, దేవదాస్ సినిమాలు అశ్వినీదత్ నిర్మించినవే. ఈ స్నేహబంధంవలన కూడా నాగ్ .. కల్కి సెట్ కు వచ్చి ఉండొచ్చు.

Advertisement

ఇక నాగ్ కెరీర్ గురించి చెప్పాలంటే .. ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్న నాగ్.. దీన్ని పూర్తి చేసి బిగ్ బాస్ లో పాల్గొననున్నాడు. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ మొదలుకానుంది. గత ఆరు సీజన్స్ గా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ సీజన్ తో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×