E-Paper
Advertisement

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీకి మూడోసారి కరోనా..

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీకి మూడోసారి కరోనా..
Advertisement

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి కరోనా బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా అక్షయ్ అస్వస్థతకు గురికావడంతో.. పరీక్షలు చేయించగా కరోనా అని తెలిసింది. దీంతో వెంటనే అక్షయ్.. ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాడు.

ఇప్పటికే ఈ హీరో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021 లో ఒకసారి కరోనా రాగా.. 2022 లో ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిందని అక్షయ్ అధికారికంగా తెలిపాడు. అంతేకాకుండా ఈ కరోనా వలన అంతకుముందులా ధృఢంగా ఉండలేకపోతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక కరోనా రావడంతో  అక్షయ్.. అనంత్ అంబానీ పెళ్ళికి హాజరుకాలేకపోతున్నాడు. నేడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహాం ముంబైలో ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ పెళ్ళికి అటెండ్ కానున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు సైతం అటెండ్ కానున్నారు. ఈ పెళ్ళికి అక్షయ్ సైతం హాజరుకావాల్సి ఉండగా.. ఇంతలో కరోనా రావడంతో అక్షయ్ పెళ్ళికి హాజరుకాలేకపోతున్నాడు.

ఇదే కాకుండా నేడు అక్షయ్ నటించిన స‌ర్ఫిరా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో ముందుకు వెళ్తుంది. సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా అక్షయ్ పాల్గొనకపోవడానికి కారణం ఇదే అని తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు అక్ష‌య్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×