BigTV English

Viral News : అమెరికాలో దొంగను చితక్కొట్టిన పంజాబీ.. భల్లే భల్లే..

Viral News : అమెరికాలో దొంగను చితక్కొట్టిన పంజాబీ.. భల్లే భల్లే..
Viral News


Viral News : అమెరికాలో స్టోర్లను లూటీ చేయడం.. ఓనర్లను టార్గెట్‌ చేసి దాడులు చేయడం కామన్‌గా మారిపోయింది. అందినకాడికి దోచుకోవడం.. అడ్డొస్తే కాల్చేయడం కూడా కామన్‌గా మారిపోయింది. కానీ ఓ దొంగ ఎరక్కపోయి వచ్చి ఓ ఇండియన్‌ స్టోర్‌లో ఇరుక్కుపోయాడు. అందినకాడికి దోచుకుందామని వచ్చిన దొంగకు.. చేతికందిన కర్రతో పిచ్చి కొట్టుడు కొట్టి.. ఇంకోసారి చోరి చేద్దామంటే భయపడేలా బుద్ది చెప్పాడు ఓ పంజాబీ.

కాలిఫోర్నియాలో భారత్‌ లోని ఓ పంజాబీకి ఓ స్టోర్ ఉంది. ఎవ్వరూ లేని సమయంలో స్టోర్‌లోకి దూరిన దొంగ.. అందినకాడికి దోచుకెళుదామని స్కెచ్‌ వేశాడు. స్టోర్ లోకి దూరాడు.. ఓనర్‌ను అక్కడ పనిచేసే వారిని బెదిరించాడు. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. ఓ వైపు అక్కడున్న వారిని బెదిరిస్తూ.. ఓ పెద్ద ట్రాష్‌ క్యాన్‌లో సామాన్లను సర్దుతున్నాడు. ఓనర్‌ చోరి చేయవద్దంటూ బతిలాడుతున్నాడు.


కాసేపటికి సీన్‌ ఒక్కసారి మారిపోయింది. ఎప్పుడైతే దొంగ బయటికి వెళ్లేందుకు రెడీ అయ్యాడో.. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో ఒక వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. ఇక మన పంజాబీ పక్కనే ఉన్న కర్రతో దొంగకు బుద్ది చెప్పడం ప్రారంభించాడు. ఇంకోసారి దొంగతనం చేస్తావా అంటూ చితకబాదాడు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చే వరకు దొంగకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో దొంగ మొరపెట్టుకున్న కనికరించలేదు పంజాబీ.

ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పోలీసులు వచ్చే వరకు చూడకుండా దొంగకు సరైన బుద్ది చెప్పాడని కొందరు అంటుంటే.. ఇలా చేయడం ప్రాణాలకు ముప్పు అంటూ మరికొందరు కామెంట్లు చూస్తున్నారు. ఏదీ ఏమైనా ఇంకోసారి దొంగలు ఆ స్టోర్ వైపు చూడాలంటేనే భయపడేలా చేశాడు ఆ పంజాబీ.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×