BigTV English
Advertisement

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Samantha: నేను నీ మాటను తీసుకున్నాను..థాంక్యూ.. సమంత పోస్ట్ వైరల్

Samantha: సమంత.. సమంత.. సమంత.. నిన్నటి నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. మంత్రి  కొండా సురేఖ.. సమంత విడాకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.  నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. అక్కినేని నాగార్జున N  కన్వెన్షన్ ను అడ్డుపెట్టుకొని సమంతను తన దగ్గరకు పంపాలని బ్లాక్ మెయిల్ చేశాడని.. నాగార్జున, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్ళమంటే ఆమె నో అని చెప్పడంతో గొడవలు మొదలై.. వెళ్తే కేటీఆర్ దగ్గరకు వెళ్లు.. లేకపోతే విడాకులు తీసుకో అని చెప్పినట్టు ఆమె ఆరోపించారు. ఇక దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం సమంత వైపు తిరిగి చూసింది.


ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా  కాదు పెద్ద తుఫాన్ లా మారింది. ఒక మహిళపై మరో మహిళ అయిన కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని ఇండస్ట్రీ మొత్తం ఖండించింది.  అక్కినేని కుటుంబం మొత్తం కొండా సురేఖ చేసి వ్యాఖ్యల్లో నిజం లేదని, ఆమె అన్న మాటలను వెనక్కి  తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమంత సైతం.. తన విడాకులు కేవలం తమ వ్యక్తిగతమని, ఇందులో రాజకీయం ఏమి లేదని తెలిపింది. అంతేకాకుండా రాజకీయ లబ్ది కోసం తమ వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయవద్దని కోరింది.

అక్కినేని కోడలుగా అడుగుపెట్టినప్పుడు సమంత ఈ రేంజ్ గా ఫేమస్ అయ్యింది. మళ్ళీ విడాకులు తీసుకున్నప్పుడు ఇంతకంటే ఎక్కువ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎవరిది తప్పు..? సమంత ఏం చేసింది.. ? నాగ చైతన్య తప్పేంటి ..? అక్కినేని ఫ్యామిలీ ఏం చేస్తున్నారు.. ? ఇలా రకరకాల  యాంగిల్స్ లో రకరకాలుగా  విసిగించి.. విసిగించి ఇప్పుడిప్పుడే సైలెంట్  అయిన సోషల్ మీడియాను కొండా సురేఖ వ్యాఖ్యలు మళ్లీ నిద్రలేచేలా చేసాయి.  ఇండస్ట్రీ మొత్తం సామ్ కు సపోర్ట్ గా  నిలబడ్డారు.


నిజం చెప్పాలంటే ఒక మహిళగా ఇలాంటి నిందలు పడడం అంటే మాములు విషయం కాదు. ఈ విషయంలో సమంత గ్రేట్ అనే చెప్పాలి. విడాకుల సమయంలో ఆమె క్యారెక్టర్ ను ఎంతగా దిగజార్చి మాట్లాడారో అందరికి తెల్సిందే.  ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించి అక్కినేని కుటుంబం పరువు తీసిందని,  కాస్ట్యూమ్ డిజైనర్ జువాల్కర్ తో ఎఫైర్ నడుపుతుందని.. ఇలా రకరకాలుగా  మాట్లాడి ఆమెను వేధించారు. అయినా సామ్.. వాటిని నవ్వుతూనే స్వీకరించింది. ఇప్పుడు కూడా  అదే నవ్వును ముఖంపై చేరగనివ్వకుండా కాపాడుకుంటుంది.

ఇక తాజాగా సామ్.. వీటన్నింటికి దూరంగా  ఇషా ఫౌండేషన్ లో సేద తీరుతుంది. ఇక నేటి నుంచి దేవి నవరాత్రులు మొదలు కావడంతో.. లింగ భైరవి ఆలయంలో అమ్మవారికి దండం పెడుతూ.. తనకు శక్తిని ఇవ్వాలని కోరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామ్ షేర్ చేస్తూ.. ” నేను నీ మాటను తీసుకున్నాను.. ధన్యవాదాలు దేవి.. మీ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సామ్ కు ధైర్యం, శక్తి నువ్వే ఇవ్వాలి  తల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×