E-Paper
Advertisement

Anurag Kashyap: ద‌క్షిణాది పాన్ ఇండియా సినిమాల‌పై అనురాగ్ అక్క‌సు!

Anurag Kashyap: ద‌క్షిణాది పాన్ ఇండియా సినిమాల‌పై అనురాగ్ అక్క‌సు!
Advertisement

Anurag Kashyap: ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హ‌వా పెరుగుతున్నాయి. బాహుబ‌లి నుంచి స్ఫూర్తి పొందిన మ‌న ద‌క్షిణాది మూవీ మేక‌ర్స్ .. కె.జి.య‌ఫ్‌, పుష్ప‌, కాంతార, కార్తికేయ 2 వంటి చిత్రాల‌తో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా మ‌న సినిమాలు నార్త్‌లోనూ రాణిస్తుండ‌టం అక్క‌డ చాలా మందికి న‌చ్చ‌టం లేదు. అయినా ఏమీ అన‌లేక సైలెంట్‌గా ఉంటున్నారు. కొంత‌మంది త‌న మ‌న‌సులో బాధ‌ను ఏదో ఒక రూపంలో బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ ద‌క్షిణాది పాన్ ఇండియా సినిమాల‌పై త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గక్కారు.

‘‘కె.జి.య‌ఫ్‌, కాంతార‌, పుష్ప వంటి సినిమాల వ‌ల్ల బాలీవుడ్ ఇండ‌స్ట్రీ నాశ‌నం అవుతుంది. ఎందుకంటే అలాంటి సినిమాలను కాపీ కొట్ట‌డానికి ఇక్క‌డి వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. దాని వ‌ల్ల న‌ష్టాల పాల‌వుతున్నారు. మ‌రాఠీ సినిమా సైర‌త్ కూడా త‌క్కువ బ‌డ్జెట్‌లో నిర్మిత‌మై పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌రాఠీ సినిమా ఇండ‌స్ట్రీ అంతా అదే స్టైల్లో సినిమాలు చేయ‌టానికి ప్ర‌య‌త్నించ‌టం వ‌ల్ల ఇండ‌స్ట్రీ దెబ్బ తింటుంది. ఒరిజినాలిటీ పోతుంది. బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్‌కి ధైర్యాన్నిచ్చే సినిమాలు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది’’ అని అన్నారు అనురాగ కశ్యప్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×