BigTV English

Ayesha Takia: సూపర్ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేరు చూడండి

Ayesha Takia: సూపర్ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేరు చూడండి

Ayesha Takia: గుచ్చి గుచ్చి చంపమాకు హొయ్ లా.. తాకుతుంటే హోలా హోలా.. సూపర్ లో ఈ సాంగ్ చూసినా.. విన్నా కూడా  ప్రతి ఒక్కరు ఆ రొమాన్స్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు. నాగార్జునతో ఆ రేంజ్ రొమాన్స్ చేసి కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్ అయేషా టకియా.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అయేషా తెలుగువారికి పరిచయమైంది.


అనుష్క ఉన్నప్పటికీ.. ఆమె రోల్ చిన్నది కాబట్టి, అందరి చూపు అయేషా మీదనే పడింది. అసలు నాగ్ తో ఆమె చేసిన రొమాన్స్, హావభావాలను మర్చిపోవడం కొద్దిగా కష్టమే. ఈ సినిమా తరువాత అయేషా తెలుగులో  కనిపించలేదు.  బాలీవుడ్ లో వాంటెడ్, టార్జాన్ ది వండర్ కార్, సోచా నా థా లాంటి సినిమాల్లో నటించి  మెప్పించింది.

ఇక 2009లో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి  దూరమైంది.  ఇక ఇన్నేళ్ల తరువాత అయేషాను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి పెళ్లి అయ్యిందిగా లావు అయ్యి ఉంటుంది.. అంతేగా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అసలు ఈ చిన్నదాని ముఖం మొత్తం మారిపోయింది. పెళ్లి తరువాత ప్లాస్టిక్ సర్జరీలు చేయించిందో ఏమో కానీ,  అస్సలు ఇప్పుడు గుర్తుపట్టడానికి కూడా  కష్టంగా అనిపించేలా మారిపోయింది.


అయేషా లేటెస్ట్ ఫోటోలో పెదాలు వాచి, బుగ్గలు రెడ్ గా మారి.. ఆ హెయిర్ స్టైల్.. దేవుడా ఏంటి అయేషా ఇంత దారుణంగా ఉంది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చీరలోనే ఈ సుందరి కనిపించినా.. ఎవరీమే అనేస్తున్నారు. తాజాగా అయేషా ఫోటోలు  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరెరే ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయిందిరా మావా అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయేషా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంలో లేదని తెలుస్తోంది. మరి ఈ భామ అసలు ఎందుకు ఇలా అయ్యిందో తెలియాలంటే ఆమెనే నోరు విప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×