E-Paper
Advertisement

Actor Sathyaraj: నరేంద్ర మోడీ బయోపిక్ లో ‘కట్టప్ప’..?

Actor Sathyaraj: నరేంద్ర మోడీ బయోపిక్ లో ‘కట్టప్ప’..?
Advertisement

Actor Sathyaraj: కోలీవుడ్ నటుడు సత్యరాజ్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా మంచి స్టార్ డమ్ ను అందుకున్న సత్యరాజ్ రీఎంట్రీలో కూడా స్టార్ నటుడుగా కొనసాగుతున్నాడు. ఇక తెలుగులో బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సత్యరాజ్ అంటే గుర్తుపట్టనివారు కట్టప్ప అనగానే గుర్తుపడతారు.

స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ అలరిస్తున్న సత్యరాజ్.. తాజాగా ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో సత్యరాజ్ నటించనున్నాడు. గత కొంతకాలం క్రితం మోడీ బయోపిక్ అంటూ ఒక సినిమా వచ్చింది. అందులో మోడీ పాత్రలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యింది అన్నమాటే కానీ, అసలు ఎప్పుడు వచ్చింది.. ఎప్పుడు పోయింది అనే విషయం కూడా జనానికి తెలియదు.

Advertisement

ఇక ఇప్పుడు మోడీ జీవీతంపై మరో సినిమా రానుంది. ఈ సినిమాలో మోడీగా కట్టప్ప సత్యరాజ్ నటించనున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అసలు ఈ సినిమా ఎవరు తెరకెక్కిస్తున్నారు.. ? ఎవరు నిర్మిస్తున్నారు.. ? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఇక ఈ విషయం తెలియదంతో సత్యరాజ్ లక్కీ ఛాన్స్ పట్టేశాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నారని, కొత్తవారు కాకుండా అందరూ స్టార్ సెలబ్రిటీలు ఇందులో నటించనున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో సత్యరాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×