E-Paper
Advertisement

Prabhas – Anushka : డార్లింగ్ కు స్వీటీతో పెళ్లి.. ఏఐ ఫోటోలు వైరల్..

Prabhas – Anushka : డార్లింగ్ కు స్వీటీతో పెళ్లి.. ఏఐ ఫోటోలు వైరల్..
Advertisement

Prabhas – Anushka : డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రభాస్ పెళ్లి టాలీవుడ్ లో ఎప్పటినుంచో హాట్ టాపిక్ గా ఉంది. అయితే తిరిగి మళ్లీ ఈ టాపిక్ తెరమీదకి వచ్చింది. ఎప్పటినుంచో ప్రభాస్ కో స్టార్ అనుష్క శెట్టి తో డేటింగ్ చేస్తున్నాడు అని ఒక రూమర్ ఉంది అయితే ఈ విషయాన్ని అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరు ఖండించారు .అయినా సరే ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ ఈ జంటను ఒకటిగా చూడాలి అని ఉబలాటపడుతూ ఉంటారు.

ప్రభాస్ ,అనుష్క ఇద్దరు తాము మంచి ఫ్రెండ్స్ అని అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. అయితే అటు అనుష్క ఇటు ప్రభాస్ ఎవరు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. పైగా ఈవెంట్స్ లో వీళ్ళిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉన్న వీడియోస్ ను ,ఫొటోస్ ను అభిమానులు మంచి లవ్ సాంగ్స్..కోట్స్ పెట్టి వైరల్ చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అంటూ ప్రభాస్ ,అనుష్క పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారు? అని వాళ్లకు పిల్లలు పుడితే ఎలా ఉంటారు? అని రకరకాల ఫోటోలు క్రియేట్ చేసి ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Advertisement

ఇప్పటికే ప్రభాస్ వయసు 43 సంవత్సరాలు.. అందుకే అతనికి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ ప్రభాస్ నేచర్, అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి.. అందరితో సులభంగా క్లోజ్ గా ఉండలేడు. అందుకే అతనిని బాగా అర్థం చేసుకునే అమ్మాయిని వెతకడానికి ఇంట్లో వాళ్లకి చాలా కష్టం అవుతుంది. అయితే కొందరు మాత్రం అనుష్క మనసులో ఉంది కాబట్టే ప్రభాస్ కు ఇంకెవరు నచ్చడం లేదు ..అందుకే ఇన్ని సంవత్సరాలైనా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు అని భావిస్తున్నారు.

ఈ విషయాలన్నీ పక్కన పెడితే మొత్తానికి వైరల్ అవుతున్న ప్రభాస్ , అనుష్క పెళ్లి ఫోటోలు మాత్రం చూడముచ్చటగా ఉన్నాయి. పెళ్లితో ఆగకుండా డార్లింగ్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళిద్దరికీ పాప పుడితే వాళ్ల లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏఐ పిక్చర్స్ రూపంలో క్రియేట్ చేసి మురిసిపోతున్నారు. దీన్నిబట్టి ప్రభాస్,అనుష్క పెళ్లి చేసుకోవాలని అతని అభిమానులు ఎంత బలంగా కోరుకుంటున్నారు అర్థం అవుతుంది. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన ఎవరైనా ఆన్ స్క్రీన్ అద్భుతంగా ఉండే ఈ జంట రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుంటే మరింత సంతోషంగా ఉన్నారు అని అనుకోక మానరు.

Advertisement

 రీసెంట్ గా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో తిరిగి మరొకసారి అనుష్క , ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ దృష్టి మొత్తం రాబోయే సలార్, కల్కి మూవీస్ పై ఉంది. బాహుబలి తర్వాత వరుస డిజాస్టర్స్ వెంటాడడంతో ప్రభాస్ తన ఫోకస్ మొత్తం కెరియర్ పై పెట్టినట్టు అర్థం అవుతుంది. అయితే ఫాన్స్ మాత్రం ప్రభాస్ మూవీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ..అంతకంటే ఎక్కువగా అతని పెళ్లి వార్త కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×