E-Paper
Advertisement

Balagam Controversy : ‘బలగం’ కథ నాదే.. కాపీ కొట్టారు.. జర్నలిస్ట్ ఆరోపణ

Balagam Controversy : ‘బలగం’ కథ నాదే.. కాపీ కొట్టారు.. జర్నలిస్ట్ ఆరోపణ

Balagam Controversy : దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మార్చి 3న విడుద‌లైన చిన్న చిత్రం ‘బలగం’. క‌మెడియ‌న్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో సుధాక‌ర్ రెడ్డి, జ‌య‌రాం, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను రిలీజ్‌కంటే ముందే దిల్ రాజు స్పెష‌ల్ షోస్ వేసి చాలా మందికి చూపించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు మంచి స్పంద‌నే వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ‘బలగం’ సినిమా క‌థ త‌నదేనంటూ ఆరోప‌ణ‌లు స్టార్ట్ చేశారు జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్‌.

గ‌డ్డం స‌తీష్ న‌మస్తే తెలంగాణ‌లో వ‌ర్క్ చేస్తున్నారు. ఆయ‌న 2011లో రాసిన క‌థ ప‌చ్చికి. 2014లో బ‌తుక‌మ్మ అనే సండే బుక్‌లో ప‌బ్లిష్ అయ్యింది. ఆ క‌థ‌నే 90 శాతం అలాగే తీసుకుని 10 శాతం చిన్నా చి తకా మార్పులు మాత్ర‌మే చేసి బ‌ల‌గం సినిమాను తెర‌కెక్కించార‌ని స‌తీష్ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే త‌న‌కు డ‌బ్బులు అక్క‌ర్లేద‌ని, క‌థకు సంబంధించిన క్రెడిట్ త‌న‌కు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఒక‌వేళ దిల్ రాజు త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే తాను చ‌ట్ట‌ప‌రంగా ముందుకు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు స‌తీష్ తెలిపారు.

మ‌రి ‘బలగం’ సినిమాపై వ‌స్తున్న వివాదంపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి మ‌రి. మ‌నిషికి బంధాలు, బాంధ‌వ్యాలే బ‌ల‌గం అని చెప్పే క‌థాంశంతోనే ఈ సినిమాను వేణు ఎల్దండి తెర‌కెక్కించారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×