E-Paper
Advertisement

Balagam movie : ఇలా షాక్ ఇస్తే ఎలా..‘బలగం’ డైరెక్టర్‌పై చిరంజీవి జోక్స్

Balagam movie : ఇలా షాక్ ఇస్తే ఎలా..‘బలగం’ డైరెక్టర్‌పై చిరంజీవి జోక్స్
Advertisement
Balagam movie

Balagam movie : మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పాత్రను పోషించేస్తున్నారు. హిట్ అయిన సినిమాలన్నింటినీ ఆయన చూడటమే కాకుండా ఆ ఠీమ్‌ని ప్రత్యేకంగా పిలిచి అభినందిస్తున్నారు. తాజాగా ‘బలగం’ మూవీ సినిమాను వీక్షించిన చిరంజీవి టీమ్‌ని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించిన‌ట్లు మ‌రెవ‌రూ ఆద‌రించ‌రు అని మ‌రోసారి రుజువు చేసిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది.

సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య భావోద్వేగాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఎంటైర్ బ‌ల‌గం టీమ్ చిరంజీవిని ప్ర‌త్యేకంగా క‌లిసింది. ఆయ‌న ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండికి శాలువా క‌ప్పి స‌న్మానించారు.

Advertisement

చిరంజీవి మాట్లాడుతూ ‘‘సినిమాను వేణు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. బలగం నిజ‌మైన మూవీ. సినిమాలో నిజాయతీగా ఉంది. దిల్ రాజు వంటి క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ఉన్న‌ప్పటికీ వేణు సినిమాకు న్యాయం చేశాడు. ప‌క్కా నెటివిటీ ఉన్న సినిమా. తెలంగాణ సంస్కృతిని వేణు చ‌క్క‌గా చూపించాడు. త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూసిన ప్ర‌తీ విష‌యాన్ని ఇందులో చూపించాడు వేణు. గ‌తంలో వేణు ఉగ్గు క‌థ‌లు, బుర్ర క‌థ‌లుపై ఓ జ‌బ‌ర్ద‌స్త్ షో చేసిన‌ప్పుడు నేను చూశాను. నిజంగా వేణులో ఇంత టాలెంట్ ఉందా అని వేణుపై గౌర‌వం పెరిగిపోయింది. ‘బలగం’ సినిమాతో త‌ను గొప్ప సినిమాను తీశాడనిపించింది’’ అన్నారు.

ఈ క్రమంలో చిరంజీవి వేణుని అభినందిస్తూ ‘ఇలా మంచి సినిమాలు తీస్తే షాకులిస్తే ఎలాగయ్యా’ అని జోక్స్ వేయటం కొస మెరుపు. చిరంజీవి అభినందనలు అందుకున్న బలగం టీమ్ సంతోషం మాటల్లో చెప్పలేమనే చెప్పాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×