E-Paper
Advertisement

NBK 109 Title: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య.. బాబీ సినిమా టైటిల్.. ఇదిగో ఇదేనట!

NBK 109 Title: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య.. బాబీ సినిమా టైటిల్.. ఇదిగో ఇదేనట!
Advertisement
NBK109
NBK109

Balakrishna NBK 109 Movie Title: బాలయ్య బాబు సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీసు బద్దలే అని అభిమానులు ఫిక్స్ అయిపోతారు. గతేడాది భగవంత్ కేసరి సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల ఇందులో బాలయ్య పెంచుకున్న కూతురిగా కనిపించింది.

ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో ‘NBK 109’ వర్కింగ్ టైటిల్‌తో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అయి మంచి హిట్లు అందుకున్నాయి. ఇక ‘వాల్తేరు వీరయ్య’కు దర్శకత్వం వహించిన దర్శకుడు బాబీ ఇప్పుడు ‘ఎన్‌బీకే 109’ మూవీకి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Advertisement

అంతేకాకుండా ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అందులో బాలయ్యబాబు మాస్ యాక్షన్ లుక్ అబ్బో వీరమాస్‌లో ఉంది. ఫస్ట్ నుంచే ఈ మూవీలో బాలయ్యను ఎప్పుడూ చూడని రేంజ్‌లో చూస్తారంటూ దర్శకుడు చెప్పుకుంటూ వచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఈ గ్లింప్స్‌లో బాలయ్యను మాస్ లుక్ లో చూపించి అదరగొట్టేసాడు. రెండు గొడ్డళ్లతో విలన్లను నరుకుతున్న తీరు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కొత్త ఎనర్జీని తెచ్చిపెట్టింది.

Also Read: హమ్మయ్య.. ఈ సారి ఎలాంటి లొల్లి లేదు.. మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు

Advertisement

ఇదిలా ఉంటే ఈ మూవీకి టైటిల్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో చాలామంది ఈ మూవీ మాస్ రేంజ్‌లో ఉంటుంది కాబట్టి టైటిల్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు బాబీ ఈ సినిమాకి ‘వీరమాస్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.

ఈ టైటిల్ పెట్టారో లేదో కానీ, ఫ్యాన్స్‌కి అయితే అద్భుతంగా నచ్చేసింది. దీంతో నిజంగా ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని సన్నివేశాల్ని కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×