E-Paper
Advertisement

Taraka Ratna : బాలయ్య భావోద్వేగం.. తారకరత్న భార్యా,పిల్లలు కన్నీరు..

Taraka Ratna : బాలయ్య భావోద్వేగం.. తారకరత్న భార్యా,పిల్లలు కన్నీరు..
Advertisement

Taraka Ratna : తన బాబాయ్‌ బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ఇష్టం. బాలయ్యనే రోల్ మోడల్ గా తీసుకున్నారు. బాబాయ్ బాటలో నందమూరి వారసుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముందుకు సాగారు. ఇలా బాబాయ్, అబ్బాయ్ ల ఆత్మీయ బంధం ఎంతో ధృడంగా ఉండేది. బాలకృష్ణ సంతకం తారకరత్న చేతిపై పచ్చబొట్టుగా ఉందంటే బాబాయ్ పై ఎంతో అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలకృష్ణ తారకరత్నపై ఎంతో ప్రేమ చూపించేవారు. తన భవిష్యత్తు మార్గనిర్దేశం చేసేవారు. తారకరత్న గుండెపోటుకు గురై బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పుడు చాలా రోజులు అక్కడే ఉన్నారు. అబ్బాయిని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అబ్బాయ్ లేడు అనే నిజాన్ని బాలయ్య జీర్ణంచుకోలేకపోయారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించే సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement

నందమూరి తారకరత్న 23 రోజులు మృత్యువుతో పోరాడారు. డాక్టర్లు అత్యుత్తమ వైద్యసేవలు అందించినా కాపాడలేకపోయారు. దీంతో చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్లిపోయారు. భర్త ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి భార్య అలేఖ్యరెడ్డి అక్కడే ఉన్నారు. భర్త కోలుకోవాలని దేవుడిని ఎంతో పార్థించారు. ఆమె పార్థనలు ఫలించలేదు. తారకరత్న మరణం ఆమెను తీవ్రంగా కుంగదీసింది. దీంతో తీవ్ర అస్వస్థత్రకు గురయ్యారు. ఆమె తీవ్ర మానసికి ఒత్తిడికి గురవుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య నీరసంగా ఉన్నారని తెలిపారు. తిరిగి మామూలు మనిషి కావడానికి సమయం పడుతుందని అంటున్నారు.

తారకరత్న పిల్లలను ఎంతో గారాబంగా పెంచేవారు. తండ్రితో వారు ఎంతో సరదాగా గడిపేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి కోసం విలపిస్తున్నారు. తారకరత్న పార్థివదేహం వద్ద కుమార్తె నిష్కా.. తమ్ముడిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్వటం అందరినీ కలచివేసింది. ప్రతి ఒక్కరి హృదయాలను కదలించింది.

Advertisement

Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

VK Naresh: న‌రేష్ వాహ‌నంపై దాడి..ఆమె కార‌ణ‌మంటున్న సీనియ‌ర్ న‌టుడు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×