E-Paper
Advertisement

Bharateeyudu 2 First Song: అనిరుధ్ లో పస తగ్గింది.. పొన్నియన్ సెల్వన్ సాంగ్ విన్నట్టే ఉంది

Bharateeyudu 2 First Song: అనిరుధ్ లో పస తగ్గింది.. పొన్నియన్ సెల్వన్ సాంగ్ విన్నట్టే ఉంది
Advertisement

Bharateeyudu 2 First Song: విక్రమ్ తరువాత కమల్ హాసన్ జోరు పెంచిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినీలను లైన్లో పెట్టాడు కమల్. ప్రస్తుతం కమల్ చేతిలో అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. అందులో ఒకటి భారతీయుడు 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శుభస్కరన్ నిర్మిస్తున్నారు.

28 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తో పాటు చాలామంది తారలు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్.. సినిమాపై అంచనాలను పెంచేసాయి.

Advertisement

తాజాగా భారతీయుడు 2 నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. శౌరా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యుద్ధభూమిలో సేనాపతి.. బ్రిటిష్ సైనికులతో పోరాటం చేస్తున్న సమయంలో వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది. చాలా లోతైన అర్థం వచ్చేలా లిరిక్స్ ను సుద్దాల అశోక్ తేజ రాసినట్లు కనిపిస్తుంది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను రితేష్ జి రావు & శృతిక సముద్రాల ఆలపించారు. ఈ ఒక్క సాంగ్ లోనే ఒకపక్క యుద్దాన్ని, ఇంకోపక్క ప్రేమను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే మ్యూజిక్ లో కొత్తదనం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

అనిరుధ్ మ్యూజిక్ అంటే.. భాష రానివారు కూడా సాంగ్ వింటూ ఊగిపోయేలా చేయగలడు. అలా చేయగలడు అని ఎన్నోసార్లు నిరూపించాడు కూడా. కానీ, ఈసారి అనిరుధ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడని చెప్పొచ్చు. ఈ సాంగ్ వింటుంటే పొన్నియన్ సెల్వన్ లోని వీర శూర సాంగ్ విన్నట్లు అనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే దేవర సాంగ్ తో కూడా అనిరుధ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

Advertisement

ఇప్పుడు భారతీయుడు 2 కూడా మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒక్క సాంగ్ తోనే అనిరుధ్ ను అంచనా వేయలేమని, సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందామని మరికొందరు అంటున్నారు. జులై 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో కమల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×