BigTV English

Mehaboob: రేవ్ పార్టీ.. ఇష్టం వచ్చినట్లు రాయకండి.. మెహబూబ్ ఫైర్

Mehaboob: రేవ్ పార్టీ.. ఇష్టం వచ్చినట్లు రాయకండి.. మెహబూబ్ ఫైర్

Mehaboob: బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ రేవ్ పార్టీ చేసాడని, పోలీసులు అరెస్ట్ చేశారని ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ జూలై 29 న తన పుట్టినరోజు వేడుకలను ఒక రిసార్ట్ లో చేసుకున్నాడు. ఇక అక్కడకు పోలీసులు వచ్చి.. అనుమతి లేకుండా మద్యం తీసుకురావడం, పార్టీ చేసుకోవడంతో మెహబూబ్ పై కేసు నమోదు చేశారు.


ఇకపోతే ఈ వార్త తెలిసినదగ్గరనుంచి రేవ్ పార్టీలో మెహబూబ్ దొరికిపోయాడని, అతనితో పాటు చాలామంది సెలబ్రిటీలు దొరికినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై మెహబూబ్ స్పందించాడు. మీడియాలో వస్తున్న సమాచారం కొంతవరకు నిజమే కానీ, అసత్యాలు ఎక్కువ ప్రచురిస్తున్నారని మెహబూబ్ ఫైర్ అయ్యాడు.

“జూలై 29న నా పుట్టినరోజు సందర్భంగా నా తమ్ముడు ఒక సర్ ప్రైజ్ పార్టీని ప్లాన్ చేశాడు. ఆ పార్టీలో నా స్నేహితులు, ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యాము. లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని మేము రిసార్ట్స్ వారికి చెప్పాము. వారు తీసుకున్నాం అని చెప్పారు. ఇక రిసార్ట్స్ లో తనిఖీలు చేస్తూ మేము ఉన్న రిస్టార్ కూడా వచ్చారు. లిక్కర్‌కి పర్మిషన్ లేకపోవడంతో ఆ బాటిల్స్‌ను సీజ్ చేయాలనీ చెప్పారు. మేము కూడా ఓకే అని చెప్పాం. అక్కడ జరిగింది ఇదే.


పర్మిషన్ లేకుండా ఇలాంటి పార్టీలు చేసుకోకూడదు అని మాకు చెప్పారు. ఇక చేయమని మేము కూడా పోలీసులకు తెలిపాం. కానీ కొంతమంది నన్ను డి ఫెమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బర్త్ డే పార్టీ కాదు రేవ్ పార్టీ అంటూ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దారుణం.

పార్టీలో చాలామంది మహిళలు ఉన్నారు. వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలా చేస్తున్నవారికి నేను ఒకటే చెప్తున్నా.. అది రేవ్ పార్టీ కాదు. తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాయకండి. నాపై అసత్య ప్రచారాలు చేస్తే నేను లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Big Stories

×