E-Paper
Advertisement

Urvashi Rautela: తెలుగులో ఇప్పుడంతా ఊర్వశి మేనియా..

Urvashi Rautela: తెలుగులో ఇప్పుడంతా ఊర్వశి మేనియా..
Advertisement

Urvashi Rautela Mania in Tollywood: బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెల అందం గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో కుర్రకారు హృదయాలను దోచేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో నెటిజన్లను ఆకర్షిస్తూనే ఉంటుంది.

ఏదో విధంగా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకునేందుకు ఖరీదైన లైఫ్‌స్లైల్‌తో దర్శనమిస్తూ ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రకారును తడిసి ముద్దయ్యేలా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. స్టైలిష్ డ్రెస్‌లో ఎంతో క్యూట్ అండ్ స్వీట్‌గా కనిపించింది.

Advertisement

రెడ్ డ్రెస్‌లో ‘జస్ట్ లుక్ లైక్ ఏ వావ్’ అనిపించింది. ఆమె ధరించిన డ్రెస్‌తో పాటు మెడలో ఉన్న నక్లెస్, దానికి మాచింగ్ ఇయర్ రింగ్స్ ఆమె అందానికే మరింత అందం తెప్పించాయి. కెమెరా ముందు ఫొటోలకు పోజులిచ్చి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటికే హిందీలో సింగ్ సాబ్ ది గ్రేట్, సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, వంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించింది. అయితే ఈ సినిమాల వల్ల కూడా ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

Advertisement

దీంతో ఈ భామ ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీపై పడింది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందంటే అక్కడ ఊర్వశి రౌటెలా కచ్చితంగా ఉంటుందనే రేంజ్‌కి ఆమె తన పేరును సంపాదించుకుంది.

అంతలా ఐటెమ్ సాంగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమెతో కలిసి పనిచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చేపిస్తున్నారు.

గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో ‘బాస్ పార్టీ’ సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీలో ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్‌లో ఓ ఊపు ఊపేసింది.

అలాగే అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీలోనూ మెరిసింది. ఇందులో కూడా తన అద్భుతమైన డ్యాన్స్‌తో అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా నటించిన ‘స్కంధ’ మూవీలో కూడా ఈమె డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అయ్యారనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో ఓ స్టార్ హీరోతో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ – బాబీ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ భాగం కానున్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు చెప్పుకొచ్చింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×