BigTV English

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Pushpa2 : పుష్ప 2 లో బాలీవుడ్ బ్యూటీ.. నీ అవ్వ అస్సలు తగ్గేదేలే..

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఏ రేంజులో హిట్ టాక్ ను అందుకుందో చెప్పనక్కర్లేదు. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా నాలుగేళ్ల తర్వాత పుష్ప 2 సినిమా రాబోతుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా అందరిని ఆకట్టుకున్నాయి. రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.


పుష్ప మూవీలో సమంత ఊ అంటావా మావా అంటూ యావత్ సినీ ప్రేక్షకుల మనసును ఊపేసింది. ఆ పాట విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పుష్ప2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటెం బ్యూటీ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటిని దింపబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వా త్రిప్తి డిమ్రిని లాక్ చేశారని అన్నారు. జాన్వీ కపూర్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా పుష్ప టీమ్ చర్చించారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ ను దింపబోతున్నారు.

ఆ బ్యూటీ మరెవ్వరో కాదు.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహోలో ఆమె హీరోయిన్ గా చేసింది.. శ్రద్దా కపూర్ పేరు పుష్ప 2 సెట్ లో చక్కర్లు కొడుతుంది. శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘స్త్రీ 2’ మూవీ బాలీవుడ్‌లో ఏకంగా 700 కోట్లు వసూలు చేసింది. దీంతో.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ బ్రేక్ చేసింది. శ్రద్దా డ్యాన్స్ ను సాహో లో చూసాము.. అందుకే ఈ బ్యూటితో పుష్ప రాజ్ స్టెప్పులు వేస్తే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.. గతంలో పుష్ప పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×