E-Paper
Advertisement

Bollywood Heros: బాలీవుడ్ అగ్రహీరోలకు షాక్.. షోకాజ్ నోటీసులు పంపిన కేంద్రం

Bollywood Heros: బాలీవుడ్ అగ్రహీరోలకు షాక్.. షోకాజ్ నోటీసులు పంపిన కేంద్రం
Advertisement

Bollywood Heros: బాలీవుడ్ అగ్రహీరోలైన షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ఈ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ హీరోలైన ఈ ముగ్గురూ కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మోతీలాల్ యాదవ్ అనే లాయర్ గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భారత ప్రభుత్వం నుంచి గౌరవనీయమైన పురస్కారాలు అందుకున్న షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ వంటి అగ్రనటులు గుట్కా ను ప్రేరేపించే ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు.. పిటిషనర్ చెప్పిన అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

Advertisement

పిటిషనర్ స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారమిచ్చారు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. అమితాబ్ బచ్చన్ ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకున్నా.. ఆయన ప్రకటనలను సదరు గుట్కా కంపెనీ ప్రసారం చేసిందని, దాంతో అమితాబ్ సదరు కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×