E-Paper
Advertisement

Hero Maanas: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రహ్మముడి హీరో..

Hero Maanas: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్రహ్మముడి హీరో..
Advertisement

Hero Maanas: మానస్ నాగులపల్లి గురించి సీరియల్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోకిలమ్మ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న మానస్.. బిగ్ బాస్ కు వెళ్లి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. కాయ్ రాజా, ప్రేమికుడు లాంటి సినిమాల్లో నటించాడు. కానీ, ఆ సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేకపోయేసరికి మళ్లీ సీరియల్స్ లోకి వచ్చేశాడు.

ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న మానస్. గతేడాది ఒక ఇంటివాడయ్యిన విషయం తెల్సిందే. శ్రీజ అనే అమ్మాయితో గతేడాది నవంబర్ లో మానస్ కు వివాహమైంది. ఇక తాజాగా మానస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. శ్రీజ, తాను త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు తెలిపాడు. వారం రోజుల క్రితమే శ్రీజకు ఘనంగా సీమంతం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఆ ఫోటోలను నేడు షేర్ చేస్తూ.. ” పెద్దలు కుదిర్చిన మా ప్రేమ ప్రయాణంలో.. మా రెండు హృదయాలు పర్ఫెక్ట్ గా మ్యాచ్ ను కనుగొన్నాయి. ఇప్పుడు మా కుటుంబం మరింత పెరుగుతుంది. బేబీ నాగులపల్లి వస్తున్నాడు” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు.. మానస్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక బిగ్ బాస్ తరువాత మానస్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీని తరువాత అతడి ఇమేజ్ కూడా పెరిగింది. ఇక గతేడాది.. మానస్ కు లక్కీ అని చెప్పాలి. పెళ్లి అయిన నెలకే ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇక పెళ్లి అయ్యి ఏడాది కాకముందే తండ్రిగా కూడా ప్రమోషన్ అందుకున్నాడు. మరి ముందు ముందు మానస్ హీరోగా కూడా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×