E-Paper
Advertisement

Chiranjeevi : ప్రేమాభిమానాలకు విలువే లేదా?.. రోజా విమర్శలకు చిరంజీవి కౌంటర్ ..

Chiranjeevi : ప్రేమాభిమానాలకు విలువే లేదా?.. రోజా విమర్శలకు చిరంజీవి కౌంటర్ ..
Advertisement

Chiranjeevi : మెగా ఫ్యామిలీపై ఇటీవల రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వాళ్లు సమాజానికి ఏం చేశారని చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ను రోజా ప్రశ్నించారు. అందుకే ముగ్గురు అన్నదమ్ముల సొంత జిల్లాలో ఓడిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తొలుత నాగబాబు కౌంటర్ వేశారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడాలనుకోవడం లేదంటూనే చురకలు అంటించారు. తాను చేస్తోన్న సేవలకు సీసీటీ, బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ బ్యాంక్.. నిలువెత్తు నిదర్శనాలని వివరించారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి.. రోజా చేసిన విమర్శలపై స్పందించారు.

తనపై చేస్తున్న విమర్శలకు కొంచెం ఘాటుగానే చిరంజీవి సమాధానం ఇచ్చారు. వాళ్ల వ్యాఖ్యలకు సమాధానం చెప్పడం అనేది తన స్థాయిని తానే తగ్గించుకున్నట్టు అవుతుందన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడైనా, ఇప్పుడైనా.. ఎదుటవారు ఎలాంటి విమర్శలు చేసినా వాటిపై స్పందించాలనుకోలేదన్నారు. రోజా తనతోపాటు నటించారని, భావోద్వేగాలను పంచుకున్నారని తెలిపారు. తన ఇంటికి వచ్చి కలిసి భోజనం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సొంతవారిలా కలిసి ఉన్నారని ఇప్పుడు వాళ్ల నైజం ప్రకారం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రోజాను ఉద్దేశించి చిరు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై స్పందించడం తన నైజం కాదన్నారు. ఏం మాట్లాడినా వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రేమ, వాత్సల్యానికి విలువనిచ్చే మనిషిని తానని పేర్కొన్నారు. వాళ్లకు కౌంటర్లు విసిరి, వాళ్లను తగ్గించేసి.. నా సెంటిమెంట్‌ను బ్రేక్ చేసుకోలేనని స్పష్టం చేశారు. వాళ్లతో అనుబంధాన్ని ఎప్పుడూ పదిలంగానే చూసుకుంటానని చెప్పారు.

Advertisement

“ప్రేమాభిమానాలకు విలువే లేదా? ఇంతేనా ఈ ప్రపంచం? ఎలాంటి లబ్ధి కోసం, ఎవరి కరుణ పొందాలని వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్లకు పరిణతి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? వేరేలా ఉండకూడదా? అని అనిపిస్తుంటుంది’’ అంటూ చిరంజీవి ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×