E-Paper
Advertisement

Chiranjeevi: చిరంజీవిని కోడిగుడ్ల‌తో కొట్టిన జగిత్యాల జ‌నాలు

Chiranjeevi: చిరంజీవిని కోడిగుడ్ల‌తో కొట్టిన జగిత్యాల జ‌నాలు
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే సినీ ఇండ‌స్ట్రీలో తిరుగులేని క‌థానాయ‌కుడు. రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పాల‌ని, త‌న వంతుగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ఆయ‌న అడుగు పెట్టారు. అయితే ఆయ‌న‌కు తిర‌స్కార‌మే ఎదురైంది. దాదాపు ద‌శాబ్ద‌కాలం పాటు రాజ‌కీయాల్లోనే ఉన్న ఆయ‌న మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేశారు. ఎప్ప‌టిలాగానే సినిమాలు చేస్తూ అభిమానుల‌ను మెప్పిస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో ఉంటూ కార్మికుల‌కు, క‌ళాకారుల‌కు త‌న‌దైన సేవ‌ను అందించ‌టంలో ఆయ‌న ఎప్పుడూ ముందుంటున్నారు. తాజాగా ఆయ‌న చెప్పిన ఓ విష‌యం నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ నెట్టింట వైర‌ల్ అయ్యేలా చిరంజీవి చెప్పిన విష‌య‌మేంటి.. ఏ సంద‌ర్భంలో చెప్పార‌నే వివ‌రాల్లోకి వెళితే..

ప్ర‌ముఖ సింగ‌ర్ స్మిత హోస్ట్‌గా మారి చేస్తోన్న టాక్ షో ‘నిజం విత్ స్మిత’. ఫిబ్రవరి 10 నుంచి ఓటీటీ ఛానెల్ సోనీ లివ్‌లో ప్ర‌సారం కానుంది. ఇందులో ముందుగా మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు. ఆయ‌న్ని రాజ‌కీయాల్లో మీకు ఎదురైన అవ‌మానాలు గురించి చెప్పండి అని అన్న‌ప్పుడు ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను జగిత్యాల వెళ్లినప్పుడు పుల వర్షం కురిపించారు. అదే ప్రాంతంలోఇంకొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడిగుడ్లతో కొట్టారు’’ అని అన్నారు. చిరంజీవి చెప్పిన స‌ద‌రు ప్రోమో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Advertisement

ప్ర‌స్తుతం ఆహాలో బాల‌కృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదిప్పుడు నెంబర్ వన్ టాక్ షో. అన్‌స్టాపబుల్‌కి ధీటుగా సోనీ లివ్ ఇప్పుడు నిజం విత్ స్మిత స్టార్ట్ చేశారు. ఈ సీజ‌న్‌లో రానున్న చిరంజీవి ఎపిసోడ్‌లో ఆయన ఎలాంటి నిజాలు చెప్పానరేది తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఇదే టాక్ షోలో రా చంద్ర‌బాబు నాయుడు స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన‌టం విశేషం. మ‌రి నిజం విత్ స్మిత ఎలాంటి స‌క్సెస్ సాధిస్తుందో చూడాలిక‌. మరో వైపు సుమ కూడా సుమ అడ్డా పేరుతో ఓ టాక్ షోను స్టార్ట్ చేసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×