E-Paper
Advertisement

Bhola Shankar : భోళా శంకర్ మూవీ అప్ డేట్స్.. మెగాస్టార్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ షురూ..

Bhola Shankar : భోళా శంకర్ మూవీ అప్ డేట్స్.. మెగాస్టార్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ షురూ..
Advertisement

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. మరో సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరు నటిస్తున్న తాజా మూవీ భోళా శంకర్ . మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవిపై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. మెగాస్టార్ 200 మంది డ్యాన్సర్లతో కలిసి చిందేస్తున్నారు.

శేఖర్ మాస్టర్ చిరుతో స్టైలిష్ స్టెప్స్ వేయిస్తున్నారు. ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్నీ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించాయి. ఈ పాట కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంచనాలున్నాయి. భోళా శంకర్ లో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు చిరుతో సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా జోడి కట్టింది. ఇప్పుడు భోళా శంకర్ లో మరోసారి మెగాస్టార్ పక్కన మిల్కీ బ్యూటీ మెరుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇలా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Advertisement

మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కాసర్ల శ్యామ్ పాటలు రాస్తున్నారు. మహాశివరాత్రికి భోళా శంకర్ పై మరిన్ని అప్ డేట్స్ చిత్ర బృందం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అజిత్ హీరోగా నటించిన తమిళ మూవీ వేదాలంకు రిమేక్ భోళా శంకర్. మాస్‌ యాక్షన్‌ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు స్టైలిష్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×